Jeevan Reddy | జెఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేయాలి : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
Jeevan Reddy | రెండు దశాబ్దాలుగా సాంకేతిక విద్యా,ఉపాధి కల్పనతోపాటు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న జగిత్యాల జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలను యూనివర్సిటీ గా అప్‌గ్రేడ్ చేయాలని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కోరారు.
జగిత్యాల : రెండు దశాబ్దాలుగా సాంకేతిక విద్యా,ఉపాధి కల్పనతోపాటు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న జగిత్యాల జేఎన్టీయూ ( Jagtia JNTU ) ఇంజినీరింగ్ కళాశాలను యూనివర్సిటీ ( University ) గా అప్‌గ్రేడ్ చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి ( Jeevan Reddy ) కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మంగళవారం లేఖను రాశారు. జగిత్యాల ఇంజినీరింగ్ కళాశాలలో ప్రతి ఏటా 1,500 మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో చేరుతున్నారని వివరించారు.
అధునాతన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ, ల్యాబ్‌తో పాటు ఆటానమస్ భవనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్యాంపస్ ప్లేస్మెంట్లు, నాక్ ఏ ప్లస్ గుర్తింపు సాధించి 2023-24 విద్యా సంవత్సరంలో ఆటానమస్ కళాశాల గుర్తింపు సాధించిం దన్నారు. సాంకేతికపరమైన విద్యా, పరిశోధన క్షేతస్థాయిలో విస్తరించాల్సిన నేపథ్యంలో అన్ని రకాల విద్యావనరులు, సుమారు 200 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్న జగిత్యాల కళాశాలను యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

