హైదరాబాద్, అక్టోబర్ 13: దేశీయ మార్కెట్లోకి అదనపు ఫీచర్లతో జియో మరో ఫీచర్ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రత్యేకంగా చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధుల భద్రతను దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ కొత్త సేఫ్టీ ఫీచర్ కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నది. పెరిగిపోతున్న ఆన్లైన్ మోసాలు, స్కామ్‌ల నేపథ్యంలో కుటుంబాల భద్రతపై ఆందోళన చెందుతున్నారు.
ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి జియోభారత్ ‘సేఫ్టీ-ఫస్ట్’ ఫోన్లో రియల్‌టైమ్ లోకేషన్ ట్రాకింగ్, వినియోగ నిర్వహణ, ఫోన్ హెల్త్ మానిటరింగ్ వంటి ఫీచర్లను అందిస్తున్నది. ఈ ఫోన్‌ను కేవలం రూ.799కే అందిస్తున్నది. దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని రూ.100 చెల్లించి బుకింగ్ చేసుకునే వీలు కల్పించింది.