రాంచీ, మే 15: మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత ఆలంగిర్ ఆలంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం అరెస్టు చేసింది. పీఎంఎల్ఏ కింద ఆయన్ను కస్టడీలోకి తీసుకొన్నట్టు ఈడీ వర్గాలు తెలిపాయి. బుధవారం దాదాపు 6 గంటల పాటు ప్రశ్నించిన అనంతరం అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకొన్నారు. ఈడీ గత వారం ఓ ఫ్లాట్‌లో రూ.32 కోట్లకు పైగా లెక్కచూపని నగదును స్వాధీనం చేసుకొన్న విషయం తెలిసిందే. తర్వాత దీనికి సంబంధించి మంత్రి ఆలంగిర్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ కుమార్ లాల్, సంజీవ్ ఇంట్లో పనిచేసే జహంగీర్‌ను అరెస్టు చేసింది.