ధన్‌బాద్ జడ్జి హత్య కేసు సీబీఐకి అప్పగింత!
ధన్‌బాద్ జడ్జి హత్య కేసు |

రాంచీ : ధన్బాద్లో న్యాయమూర్తి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. జడ్జి మార్నింగ్ జాగింగ్‌కు వెళ్లిన సందర్భంలో ఆటోతో ఢీకొట్టడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. సీఎం హేమంత్ సోరెన్ ఘటనపై విచారణ జరుపాలని కేంద్ర విచారణ సంస్థకు సిఫారసు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. కేసు దర్యాప్తు కోసం జార్ఖండ్ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాల మేరకు సిట్‌ను ఏర్పాటు చేసింది. ధన్‌బాద్ అదనపు సెషన్స్ కోర్టు జడ్జి ఉత్తమ్ ఆనంద్ గత నెల 28న ఉదయం రోడ్డు పక్కన జాగింగ్ చేస్తున్న జడ్జిని ఓ ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టి వెళ్లిపోయింది. రక్తపు మడుగులో ఉన్న ఆయనను ఓ వ్యక్తి గమనించి దవాఖానకు తరలించగా.. మృతి చెందారు.
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఆటో ఉద్దేశపూర్వకంగానే జడ్జిని ఢీకొట్టినట్లు తేలినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతో.. ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఘటనలో తమప్రేమం ఉందని నిందితులు సైతం ఒప్పుకున్నారని ఇన్స్పెక్టర్ జనరల్ అమోల్ వినుకాంత్ హోంకార్ తెలిపారు. ఆటోను దొంగతనం చేశారని పేర్కొన్నారు. పట్టణంలో అనేక మాఫియా హత్యకేసులను న్యాయమూర్తి విచారిస్తున్నారు. ఇటీవల ఇద్దరు గ్యాంగ్స్టర్ల బెయిల్ అభ్యర్థనలను తిరస్కరించారు. ఎమ్మెల్యే సంజీవ్‌సింగ్ సన్నిహితుడు రంజయ్ సింగ్ హత్య కేసు సైతం కోర్టులో పెండింగ్‌లో ఉంది. హత్య కేసు విషయంలో బాధిత కుటుంబం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో జాప్యం జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు విచారణకు ప్రత్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేశారు.
కేసు దర్యాప్తును తామే పర్యవేక్షిస్తామని, దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు అందించాలని సిట్‌ను ఆదేశించింది. అయితే, కేసును సీబీఐకి బదిలీ చేస్తే విచారణలో జాప్యానికి దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, ఈ కేసు విచారణను తనకు తానుగా చేపట్టిన సుప్రీంకోర్టు.. ఝార్ఖండ్ ప్రభుత్వం నుంచి స్టేటస్ రిపోర్టును కోరింది. చీఫ్ సెక్రటరీ, డీజీపీ వారం రోజుల్లోగా ఈ రిపోర్టును పంపాలని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఇది రోడ్ యాక్సిడెంట్ కాదని స్పష్టంగా తెలుస్తోందని ఈ బెంచ్ వ్యాఖ్యానించింది. హైకోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్ లో జోక్యం చేసుకోవడం తమ అభిమతం కాదని, కానీ.. ఈ విధమైన అంశాలను విస్తృత రాజ్యాంగ పరిధిలో పరిశీలించవలసిన అవసరం ఉందని జస్టిస్ రమణ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
తిరగక.. చెడే ఆరోగ్యం
కర్ణాటక వెళ్తే ఆర్టీ పీసీఆర్ నెగెటివ్ తప్పనిసరి.. ఎవరికంటే?
నైట్ కర్ఫ్యూ పొడగింపు.. ఎక్కడ? ఎప్పటి వరకంటే?
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Train collision | ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. ఏడుగరు మృతి 100 మందికి గాయాలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

