హైదరాబాద్: నగరంలోని అమెరికా కౌన్సులేట్ జనరల్ ఆఫీసుకు కొత్త కౌన్సుల్ జనరల్‌గా జెన్నిఫర్ లార్సన్ నియమితులయ్యారు. గతంలో ఆమె ముంబైలోని యూఎస్ కౌన్సులేట్ జనరల్‌లో డిప్యూటీ ప్రిన్సిపల్ ఆఫీసర్‌గా చేశారు. ఇండియాకు తాత్కాలిక డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా కూడా చేశారు. సోమవారం నుంచి హైదరాబాద్‌లోని యూఎస్ కౌన్సులేట్ జనరల్‌లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌కు రావడం అత్యంత సంతోషకరంగా ఉన్నట్లు జెన్నిఫర్ తెలిపారు. అమెరికా, ఇండియా మధ్య బంధాన్ని పెంచే దిశగా తాను ముంబై, వాషింగ్టన్ నుంచి పనిచేసినట్లు ఆమె చెప్పారు. తెలంగాణ, ఏపీ, ఒడిశాలో తమ భాగస్వామ్యాన్ని విస్తరించే దిశగా కృషి చేయనున్నట్లు ఆమె తెలిపారు. సంయుక్త సైనిక విన్యాసాలు, వ్యాపారాలు, సంస్కృతిక సంబంధాలు, ఉన్నత విద్య లాంటి అంశాల్లో అమెరికా, హైదరాబాద్ మధ్య బంధం బలోపేతం అవుతున్నట్లు కౌన్సుల్ జనరల్ లార్సెన్ తెలిపారు.
కౌన్సుల్ జనరల్ లార్సన్‌కు దౌత్య సంబంధాల్లో 19 ఏళ్ల అనుభవం ఉంది. వాషింగ్టన్లో ఇండియా తరపున తాత్కాలిక డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా ఆమె విధులు నిర్వర్తించారు. అక్కడ ఆమె దక్షిణాసియా సంబంధాల మెరుగు కోసం పనిచేశారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఇండో పసిఫిక్ రీజనల్ కోఆపరేషన్ ఇన్ ఏ పోస్ట్ కోవిడ్ 19 వరల్డ్ ఆర్డర్ అంతర్జాతీయ సమావేశంలోనూ లార్సన్ ప్రసంగించారు. 2016 నుంచి 2020 వరకు ముంబైలోని యూఎస్ కౌన్సులేట్‌లో డిప్యూటీ ప్రిన్సిపల్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. కౌన్సులేట్ ఆఫీసుల్లో ఇది రెండవ అత్యున్నత ర్యాంక్ కావడం విశేషం. వాషింగ్టన్ డీసీలోని ఈస్ట్రన్ అఫైర్స్‌లో అధికార ప్రతినిధిగా చేశారు. లిబియా, పాకిస్థాన్, ఫ్రాన్స్, సుడాన్, జెరుసలాం, లెబనాన్ దేశాల్లోనూ ఆమె వివిధ హోదాల్లో పనిచేశారు.
ఫారిన్ సర్వీస్‌లో చేరడానికి ముందు.. కౌన్సుల్ జనరల్ లార్సన్ అనేక చోట్ల పనిచేశారు. శాన్ఫ్రాన్సిస్కోలోని నేషనల్ పబ్లిక్ రేడియోలో చేశారామె. అక్కడ టాక్ షో ప్రొడ్యూసర్‌గా ఆమె తన విధులు నిర్వర్తించారు. కాలిఫోర్నియాలో అండర్గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.