KTR | ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలలోని నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని కేటీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్, జీవన్ రెడ్డికి దశాబ్ధాలకుపైగా పరస్పర గౌరవం, స్నేహం ఎప్పడి నుంచో ఉంది. రెండు సందర్భాల్లో నా కండ్ల ముందు జరిగినయ్ గుర్తొస్తున్నాయన్నారు.
2014 జూన్ 2న కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాల్లో వారి మొట్టమొదటి అధికారిక ప్రకటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోనే మొదలైంది. ఆ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక ఆడిటోరియంలో మీటింగ్ జరిగింది. జీవన్ రెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నాయకుడు, ప్రతిపక్షానికి సంబంధించిన శాసనసభ్యులు.. కానీ కేసీఆర్ స్వయంగా ముందు జీవన్ రెడ్డికి మైక్ ఇవ్వండి అని చెప్పివారి మైక్ అందిస్తే వారు నేరుగా అభినందనలు చెప్పి జగిత్యాల ప్రజల తరపున నేను మిమ్మల్ని ఒకటి అడగ దలచుకున్నా బోర్నపల్లి గ్రామానికి సంబంధించి ఒక బ్రిడ్జి కావాలని ఒక్క మాట చిన్నగా అడిగారు. అప్పుడే మేం కొత్తగా మంత్రులైనం. కేసీఆర్ ఎట్లా స్పందిస్తరు చూస్తా ఉన్నం. సాధారణంగా చూస్తాం.. పరిశీలిస్తాం. అని చెప్పొచ్చు. జీవన్ రెడ్డి మీదున్న గౌరవం, ప్రేమ ఎట్టాంటిదంటే.. కేసీఆర్ రూ.70 కోట్ల బ్రిడ్జిని అక్కడికక్కడే మంజూరు చేసి కరీంనగర్ జిల్లాలోనే మొట్టమొదటి మంజూరు చేసిన బ్రిడ్జిని ఇచ్చారన్నారు..
కాంగ్రెస్‌లోనే కొనసాగారు..
2014 ఎన్నికల ముందు కేసీఆర్ జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. జీవన్ రెడ్డి నిబద్ధత గల నాయకుడు.. కాంగ్రెస్‌లోనే కొనసాగారు. అసెంబ్లీలో ఎప్పుడూ ప్రజా సమస్యల గురించి ముఖ్యంగా రైతుల చాలా గట్టిగా మాట్లాడే నాయకుడు. జగిత్యాల జిల్లాలో నిజాం షుగర్స్ చాలా ముఖ్యమైనదని.. దాన్ని ఖచ్చితంగా తెరిపించాల్సిందేనని విద్యాసాగర్ రావు, జీవన్ రెడ్డి ఇద్దరూ కొట్లాడేవారు. షుగర్ ఫ్యాక్టరీని ఖచ్చితంగా తెరిపించాల్సిందే.. మేం కూడా మాటిస్తున్నాం. కానీ పక్కనే ఉన్న మహారాష్ట్రలో (అప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి) సహకార వ్యవస్థలో అక్కడి షుగర్ మిల్లులు చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నయ్.
టెస్కాబ్ చైర్మన్, మాజీ అధ్యక్షుడు రవిందర్ రావు కూడా ఇక్కడే ఉన్నరు. అట్లా కో ఆపరేటివ్ వ్యవస్థను బాగు చేస్తే బాగుంటది జీవన్ రెడ్డి గారు ఒకవేళ మీకు కావాలనుకుంటే ప్రభుత్వం నుంచి రూ.250 నుంచి 300 కోట్లు పెట్టేందుకు కూడా మేం సిద్ధంగా ఉన్నామని.. అవసరమైత మీరే దానికి చైర్మన్‌గా ఉండండి.. అని చెప్పి నిండు శాసనసభలో కేసీఆర్ ఆనాడు జీవన్ రెడ్డిగారికి ఎలాంటి భేషజానికి పోకుండా ఓపెన్‌గా చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు.
అంతకుముందు జగిత్యాల శివారులో బీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్‌కు స్వాగతం పలికాయి. అక్కడి నుంచి బైక్ ర్యాలీతో జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. కేటీఆర్ రాకతో జీవన్ రెడ్డి నివాసంతో పాటు జగిత్యాల పట్టణం గులాబీమయంగా మారింది.
జగిత్యాలలో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS భేటీ
ఈ సందర్భంగా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ pic.twitter.com/YHygEioDpx
— BRS Party (@BRSparty) April 9, 2026
LIVE: జగిత్యాలలో మాజీ మంత్రి, సీనియర్ నాయకులు జీవన్ రెడ్డితో భేటీ అయిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
https://t.co/OUidgW9DRW— BRS Party (@BRSparty) April 9, 2026