జననేతకు జేజేలు
- ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు
- పలు చోట్ల కేక్ కట్‌చేసి సంబురాలు
- పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ,పార్టీ శ్రేణులు
- ఎంఎల్ఆర్ విద్యాసంస్థల్లో రక్తదాన శిబిరాల నిర్వహణ
- పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు..దర్గాల్లో ప్రార్థనలు
దుండిగల్/కుత్బుల్లాపూర్/జీడిమెట్ల/గాజులరామారం,ఫిబ్రవరి17: ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో టీఆర్ఎస్ శ్రేణులు గురువారం సంబురాలు జరుపుకున్నారు. పలుచోట్ల కేక్‌లు కట్‌చేయగా, మరికొన్నిచోట్ల మొక్కలు నాటారు. దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ఐటీ,ఎంఎల్ఆర్ఐటీఎం,ఐఏఆర్ఈ,ఎంఎల్ఆర్ఫార్మసీ కళాశాలల్లో కళాశాలల సెక్రటరీ,టీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంటరీ స్థానం ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయాకళాశాలకు చెందిన అధ్యాపకులు,విద్యార్థులు స్వచ్ఛందంగా ముందు కొచ్చి రక్తదానం చేయడంతో 556 యూనిట్ల రక్తం సేకరించారు. రాజశేఖర్‌రెడ్డి స్వయంగా రక్తదానం చేశారు.
- సుభాష్‌నగర్‌లో టీఆర్ఎస్ నాయకులు కేక్‌ను కట్ చేసి పారిశుధ్య కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సుభాష్‌నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు పోలే శ్రీకాంత్, నాయకులు అడపా శేషు, కె.శ్రీనివాస్, పద్మజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- రంగారెడ్డినగర్ డివిజన్ పరిధి ఆదర్శనగర్ కమ్యూనిటీ హాల్ వద్ద ఉన్న పార్కులో స్థానిక కార్పొరేటర్ బి.విజయ్‌శేఖర్‌గౌడ్‌తో పాటు స్థానిక నాయకులు పాల్గొని మొక్కలు నాటారు.
- గాజులరామారం డివిజన్ పరిధిలొని దేవేందర్‌నగర్ చౌరస్తాలో ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ డాక్టర్ మచ్చేందర్, శోభన్‌బాబు, రవీందర్‌గౌడ్, సుశాంత్‌ల ఆధ్వర్యంలో సీఎం జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రావుల శేషగిరిరావు పాల్గొని కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. అనంతరం సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ పార్టీ సెక్రటరీ నవాబు, ఉపాధ్యక్షులు సింగారం మల్లేశ్, భాస్కర్, మహిళా అధ్యక్షురాలు సంధ్యారాణి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు లక్ష్మణ్, గోవర్ధన్‌రెడ్డి, వెంకటేశ్, యూత్ జనరల్ సెక్రటరీ నవీన్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

