Barabar Premistha | ప్రముఖ టీవీ యాక్టర్ ప్రభాకర్ కుమారుడు, రామ్ నగర్ బన్నీఫేం చంద్రహాస్ (ChandraHass) హీరోగా నటిస్తోన్న మూవీ బరాబర్ ప్రేమిస్తా. సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి పాపులర్ డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ సపోర్టుగా నిలిచాడు. ఈ మూవీ నుంచి రొమాంటిక్ మెలోడీ మళ్లీ మళ్లీ సాంగ్‌ను విడుదల చేశాడు.
తెలంగాణలోని రుద్రారం అనే విలేజ్ బ్యాక్ డ్రాప్లో సినిమా ఉండబోతుందని.. పరస్పరం గొడవలు పడే ఊరిలో ప్రేమ, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో సాగే లవ్‌స్టోరీని చూపించబోతున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ద్వారా హింట్ ఇచ్చేశారు మేకర్స్.
ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీలో అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సీసీ క్రియేషన్స్, ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఏవీఆర్ నిర్మిస్తున్నారు.
When love speaks softly, music listens 💖🎵
Romantic track #MalliMalli launched by #JayanthCParanjee from #BarabarPremistha, starring Attitude Star #ChandraHass ✨
A melody that feels timeless and tender 💞
▶️ https://t.co/1h1C5lDUHC
Releasing in cinemas FEBRUARY 6th pic.twitter.com/Amlp1tyni8— Kartheeeka 🎀🦚 (@urskartheeka) January 26, 2026