దుబాయ్: ఆరు నెలలుగా విరామం లేకుండా ఆడుతున్న తమకు విశ్రాంతి అవసరమని భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా తెలిపాడు. బయో బబుల్‌లో ఉండడం చాలా కష్టంగా ఉందని చెప్పాడు. న్యూజిలాండ్‌తో ఓటమి అనంతరం జరిగిన సమావేశంలో బుమ్రా మాట్లాడుతూ.. ‘బయో బబుల్‌కు అలవాటు పడడానికి ప్రయత్నిస్తున్నాం. ఆటగాళ్లకు కొన్నిసార్లు విశ్రాంతి అవసరం. కుటుంబానికి దూరంగా ఉంటుంటారు. ఆరు నెలలుగా విరామం లేకుండా ఆడుతున్నాం. ఇంత సుదీర్ఘకాలం కుటుంబానికి దూరంగా.. బయోబబుల్‌లో ఉండడం ఆటగాళ్ల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. మేమంతా సౌకర్యంగా ఉండేందుకు బీసీసీఐ వీలైనంత మేర ప్రయత్నిస్తున్నది’ అని అన్నాడు.