Krish 4 | బాలీవుడ్లో “గ్రీకు వీరుడు”గా పేరుతెచ్చుకున్న హృతిక్ రోషన్‌కు దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన ప్రతి సినిమాకీ ప్రత్యేకమైన క్రేజ్ ఉండగా, ముఖ్యంగా సూపర్ హీరో ఫ్రాంచైజ్ ‘క్రిష్’ సిరీస్‌కు ఆడియన్స్‌లో ప్రత్యేక డిమాండ్ ఉంది. ఈ సిరీస్‌లో వచ్చిన గత చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలవడంతో ‘క్రిష్ 4’పై అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటివరకు ‘క్రిష్’ సిరీస్‌లో వచ్చిన మూడు సినిమాలను హృతిక్ తండ్రి రాకేష్ రోషన్ తెరకెక్కించగా, నాలుగో భాగానికి మాత్రం స్వయంగా హృతిక్ రోషనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడనే వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. అంతేకాదు, ఈ సినిమాకు కథను కూడా ఆయనే సిద్ధం చేస్తున్నాడట. హీరోగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకోవాలని హృతిక్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక ఈ ప్రాజెక్ట్‌లో మరో ఆసక్తికర అంశం యష్ రాజ్ ఫిలిమ్స్ ఎంట్రీ. భారీ స్థాయి నిర్మాణ విలువలతో సినిమాలు తీసే ఈ బ్యానర్ ‘క్రిష్ 4’ను నిర్మించనున్నట్టు సమాచారం. అయితే ఇక్కడే బడ్జెట్ విషయంలో విభేదాలు నెలకొన్నాయనే టాక్ వినిపిస్తోంది. హృతిక్ ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కించాలని భావిస్తూ సుమారు రూ.500 కోట్ల బడ్జెట్ అవసరమని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి యష్ రాజ్ ఫిలిమ్స్ మాత్రం పూర్తిగా అంగీకరించలేదని తెలుస్తోంది. రూ.350 కోట్లలోనే సినిమాను పూర్తి చేయాలని సూచించడమే కాకుండా, బడ్జెట్ పెరిగితే ప్రాజెక్ట్ నుంచి తప్పుకునే అవకాశముందని హెచ్చరించినట్టుగా బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ అనూహ్య పరిణామంతో హృతిక్ కొంత అయోమయంలో పడినట్టు తెలుస్తోంది.
భారీ గ్రాఫిక్స్, యాక్షన్ సన్నివేశాలు, సూపర్ హీరో ఎలిమెంట్స్ అన్నీ కలిపి ‘క్రిష్ 4’ను గ్రాండ్‌గా తెరకెక్కించాలనుకుంటున్న హృతిక్‌కు ఈ బడ్జెట్ పరిమితి సవాలుగా మారింది. చివరికి నిర్మాతలతో రాజీ పడతాడా? లేక తన విజన్‌కు తగ్గట్టుగా కొత్త మార్గం ఎంచుకుంటాడా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘క్రిష్ 4’ భవిష్యత్తుపై అధికారిక క్లారిటీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.