Janasena | మున్సిపల్ ఎన్నికల్లో తమకు జనసేనతో పొత్తు అవసరం లేదని తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు చేసిన వ్యాఖ్యలపై జనసేన ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ స్పందించారు. తెలంగాణపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు అమితమైన ప్రేమ ఉందని తెలిపారు. రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని పేర్కొన్నారు. పొత్తు లేకున్నా జనసేన పోటీకి సిద్ధమని స్పష్టం చేశారు. ఎన్నికల కోసం అడ్‌హక్ కమిటీలు కూడా వేసుకున్నామని వెల్లడించారు. తెలంగాణలో త్వరలోనే పవన్ కల్యాన్ పర్యటిస్తారని తెలిపారు. సమావేశాలు కూడా ఉంటాయని చెప్పారు.
తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్దమని జనసేన నిన్న (శనివారం) ప్రకటించింది. ఈ మేరకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే కార్యాచరణను ప్రారంభించినట్లు తెలిపారు. ఎన్నికలకు నెల రోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ.. సాధ్యమైనన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులకు బరిలో దించుతామని పేర్కొన్నారు. జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, పవన్ కల్యాన్ భావజాలాన్ని, ఆయన ఆశయాలను తెలంగాణ ప్రజలకు చేరవేయడం తద్వారా తెలంగాణలో సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించారు.
కాగా, తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్దమని జనసేన నిన్న (శనివారం) ప్రకటించింది. ఈ మేరకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే కార్యాచరణను ప్రారంభించినట్లు తెలిపారు. ఎన్నికలకు నెల రోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ.. సాధ్యమైనన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులకు బరిలో దించుతామని పేర్కొన్నారు. జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, పవన్ కల్యాన్ భావజాలాన్ని, ఆయన ఆశయాలను తెలంగాణ ప్రజలకు చేరవేయడం తద్వారా తెలంగాణలో సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించారు.
మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు ప్రకటించారు. జనసేనతో బీజేపీకి పొత్తు అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో పరిణామాల ఆధారంగానే కూటమిగా ఏర్పడ్డామని రాంచందర్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేనతో పొత్తు అవసరం లేదని తేల్చి చెప్పారు. ఒకవేళ పొత్తు అవసరం అనుకుంటే జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. తెలంగాణలో బలంగా ఉన్నామని.. అధిష్ఠానానికి కూడా ఇదే విషయం చెబుతామని అన్నారు. కాగా, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని జనసేన ప్రకటించిన నేపథ్యంలో రాంచందర్‌రావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.