Janasena – BJP | జనసేనతో మాకు పొత్తు అవసరం లేదు.. తెలంగాణ బీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
Janasena - BJP | జనసేన పార్టీతో పొత్తుపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. జనసేనతో బీజేపీకి పొత్తు అవసరం లేదని స్పష్టం చేశారు.
Janasena – BJP | జనసేన పార్టీతో పొత్తుపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ రాంచందర్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు. జనసేనతో బీజేపీకి పొత్తు అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు.
ఏపీలో పరిణామాల ఆధారంగానే కూటమిగా ఏర్పడ్డామని రాంచందర్రావు స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేనతో పొత్తు అవసరం లేదని తేల్చి చెప్పారు. ఒకవేళ పొత్తు అవసరం అనుకుంటే జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. తెలంగాణలో బలంగా ఉన్నామని.. అధిష్ఠానానికి కూడా ఇదే విషయం చెబుతామని అన్నారు. కాగా, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని జనసేన ప్రకటించిన నేపథ్యంలో రాంచందర్రావు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సిద్దమని జనసేన నిన్న (శనివారం) ప్రకటించింది. ఈ మేరకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే కార్యాచరణను ప్రారంభించినట్లు తెలిపారు. ఎన్నికలకు నెల రోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ.. సాధ్యమైనన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులకు బరిలో దించుతామని పేర్కొన్నారు. జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, పవన్ కల్యాన్ భావజాలాన్ని, ఆయన ఆశయాలను తెలంగాణ ప్రజలకు చేరవేయడం తద్వారా తెలంగాణలో సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

