ఉద్యోగుల సర్వీసు రికార్డులన్నీ డిజిటలైజ్.. సీఎస్
తెలంగాణ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఐఎఫ్ఎంఐఎస్)లో భాగంగా రూపొందించిన ఎలక్ట్రానిక్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈ-హెచ్ఆర్ఎంఎస్)ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు శనివారం ఉత్తర్వులు జారీచేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఐఎఫ్ఎంఐఎస్)లో భాగంగా రూపొందించిన ఎలక్ట్రానిక్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈ-హెచ్ఆర్ఎంఎస్)ను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. సెలవులు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, బదిలీలు, వార్షిక రహస్య నివేదికలు (ఏసీఆర్), వార్షిక పనితీరు మదింపు నివేదికలు (ఏపీఏఆర్), స్థిరాస్తుల వివరాల సమర్పణ (ఐపీఆర్), విజిలెన్స్ వ్యవహారాలు, ఉద్యోగ విరమణ కేసులను ఆన్లైన్ ద్వారా ప్రాసెస్ చేయనున్నారు. సచివాలయ శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాలు, జిల్లా కార్యాలయాలు, ఇతర కింది స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ వ్యవస్థను అమలు చేయాలని ఆదేశించారు.
సహాయం కోసం సంప్రదింపు కేంద్రాలు
ఈ-హెచ్ఆర్ఎంఎస్, ఐఎఫ్ఎంఐఎస్ వినియోగంపై సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చినట్టు జీవోలో సీఎస్ పేరొన్నారు. జిల్లా స్థాయిలో పరిషారం కాని సమస్యల కోసం ఐఎఫ్ఎంఐఎస్ హెల్ప్‌లైన్ 7042420033ను సంప్రదించాలని సూచించారు. ఉద్యోగుల సర్వీసు వ్యవహారాలను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడంతోపాటు కేంద్ర ప్రభుత్వ మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక సహాయ పథకం 2026-27 కింద సంసరణల లక్ష్యాలను చేరుకునేందుకు అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు.
ఇకపై డిజిటల్ పద్ధతిలోనే నిధుల మంజూరు
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో జరిగే పనులు మినహా, మిగిలిన అన్ని రకాల పనులకు ఇకపై డిజిటల్ పద్ధతిలోనే నిధులు మంజూరు చేయాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. కొత్త విధానంలో మంజూరు ఉత్త ర్వు, బిల్లు, చెల్లింపులన్నీ డిజిటల్‌గా అనుసంధాన మై దుర్వినియోగానికి అడ్డుకట్ట పడుతుందని పే ర్కొన్నారు. సచివాలయం నుంచి క్షేత్రస్థాయి కా ర్యాలయాల వరకు ‘ఈ-మంజూరు’ మాడ్యూల్ ను అమలు చేయాలని స్పష్టం చేశారు. పర్యవేక్షణ బాధ్యతలను ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్‌కు అప్పగించినట్టు వెల్లడించారు. ఏఎఫ్ఎంఐఎస్ హెల్ప్‌లైన్ +91-70424200 33ను ఏర్పాటుతోపాటు జిల్లాలవారీగా నోడల్ అధికారులను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- ACR
- Apar
- CS Sanjay Jaju
- Digitized
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

