Janaki vs State of Kerala | మలయాళం ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా నడిచిన ‘జానకి వర్సెస్ కేరళ’ టైటిల్ వివాదం ఎట్టకేలకు ముగిసిన విషయం తెలిసిందే. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) సూచనల మేరకు నిర్మాతలు ఈ సినిమా టైటిల్‌ను మార్చడానికి అంగీకరించారు. ‘జానకి వర్సెస్ కేరళ’ అనే పాత టైటిల్‌ను జానకి వీ vs స్టేట్ అఫ్ కేరళ అనే టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు. సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించగా.. కోర్ట్‌రూమ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కింది. కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై జె. ఫణీంద్ర కుమార్ నిర్మించారు. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్న ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.
ఈ ట్రైలర్ చూస్తుంటే జానకి విద్యాదరన్ (అనుపమ పరమేశ్వరన్) అనే యువతి లైంగిక దాడికి గురవ్వగా.. న్యాయం కోసం ఆమె చేసే పోరాటమే ఈ సినిమా కథ. దివ్య పిళ్లై, శృతి రామచంద్రన్, అస్కర్ అలీ, మాధవ్ సురేష్ గోపి, బైజు సంతోష్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.