జైపూర్, జనవరి 20: ప్రపంచంలోనే అతి చిన్న చెక్క స్పూన్‌ను తయారు చేసిన జైపూర్ వాసి గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. నవరతన్ ప్రజాపతి మూర్తికర్ ఈ ఫీట్‌ను సాధించాడు. ఈ స్పూన్ రెండు మిల్లీమీటర్ల ఎత్తు, 0.7 అంగుళాల పొడవు ఉన్నది. దీనిని చెక్కుతున్న వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డు తన ట్విట్టర్ పేజీలో పోస్టు చేసింది.