MLC Jeevan Reddy : జగిత్యాల జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వినతి పత్రం అందజేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ సెక్యురిటీ గార్డులకు ఏజెన్సీ విధానం రద్దు చేసి.. వారి సర్వీస్‌ను రెగ్యులరైజ్ చేయాలని కోరింది. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో 1994 నుంచి ఇప్పటి వరకు సెక్యురిటీ గార్డ్స్ 1200 మంది నియమితులయ్యారు.
దాదాపు 27 సంవత్సరాలుగా వారు మార్కెట్ కమిటీలకు సేవలు చేస్తున్నారు. ఈ క్రమంలో ‘మాకు ఏజన్సీ విదానాన్ని రద్దు చేస్తూ మా సర్వీసును రెగ్యులరైజ్ చేయండి’ తెలంగాణ వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న ఉద్యోగుల సంఘం కోరింది. అందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, పరిష్కరానికి కృషి చేస్తానని చెప్పారు.