బిజినేపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి ( Bijinepally ) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో వేసవి సెలవుల సందర్భంగా నిర్వహించిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా క్రికెట్ టోర్నమెంట్ (Cricket tournament) సోమవారం ముగిసింది. సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల టీం విన్నర్‌గా, నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ టీం రన్నర్ ఆఫ్ గా నిలిచాయి.
ఈ టోర్నమెంట్లో జడ్చర్ల విజేత జట్టుకు ఫస్ట్ ప్రైజ్ ట్రోఫీతో పాటు రూ. 50వేల ప్రైజ్‌మనీని అందజేశారు. గుమ్మకొండ టీంకు రన్నర్ ఆఫ్ సెకండ్ ప్రైజ్ ట్రోఫితో పాటు రూ. 25 వేలను మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగనామోని కిరణ్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోవటం సహజమని అన్నారు. గ్రామీణ స్థాయిలో మంచి ఫలితాలు సాధించి రాష్ట్ర జాతీయ స్థాయిలో బహుమతులు సాధించాలని కోరారు.కార్యక్రమంలో రాము నాయక్,రఘు బాబు,అనిల్ గౌడ్, నరేంద్ర గౌడ్, అజిమ్, బాలరాజు , పలువురు ప్రజాప్రతినిధులు , నాయకులు , యువకులు పాల్గొన్నారు.