Jacqueline first look in Vikrant Rona | కన్నడ నటుడు కిచ్చా సుదీప్ ( kiccha sudeep ) గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈగ సినిమాతో టాలీవుడ్ ( Tollywood ) కు పరిచయమైన సుదీప్.. బాహుబలి ( Bahubali ), సైరా వంటి పాన్ ఇండియన్ సినిమాల్లోనూ నటించి తెలుగువారికి దగ్గరయ్యాడు. ఇప్పుడు మరో పాన్ ఇండియన్ సినిమాతో పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ సినిమా పేరే విక్రాంత్ రోణ. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ, మలయాళం సహా 14 భాషల్లో 3డీలో రూపొందుతున్న ఈ సినిమాను 55 దేశాల్లో విడుదల చేయబోతున్నారు.
శాండిల్‌వుడ్ బాద్షా సుదీప్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇటీవల 25 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో జనవరి 31న దుబాయిలోని ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై ఒక వేడుకను కూడా నిర్వహించారు. ఈ వేడుకలో విక్రాంత్ రోణ సినిమా టైటిల్ లోగోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆగస్టు 19న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతున్న విక్రాంత్ రోణ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలకపాత్రలో నటిస్తోంది.
'What Rakkamma doesn't know, doesn't exist'
— Kichcha Sudeepa (@KicchaSudeep) July 31, 2021
Introducing @Asli_Jacqueline as #GadangRakkamma from #VikrantRona #JacquelineVikrantRonaLook #JacquelineAsRakkamma @JackManjunath @anupsbhandari @shaliniartss @Alankar_Pandian @VikrantRona @GadangRakkamma pic.twitter.com/eQx98bB0hL
సుదీప్, జాక్వెలిన్‌పై ఇటీవల ఆరు రోజుల పాటు ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేశారు. ఈ ఐటెం సాంగ్ కోసం భారీ సెట్ వేశారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ పాటలో 300 మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు. ఈ ఒక్క పాట కోసమే నిర్మాతలు దాదాపు రూ.5కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలోని జాక్వెలిన్ ఫస్ట్ లుక్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. గడంగ్ రక్కమ్మ ( gadang rakkamma ) పాత్రలో ఆమె కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సాహో తర్వాత జాక్వెలిన్ నటిస్తున్న దక్షిణాది సినిమా ఇదే. దీంతో పాటు పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న హరిహర వీరమల్లు సినిమాలోనూ జాక్వెలిన్ కీలకపాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
అభిమానులకు షాక్.. సోషల్ మీడియాలో అక్కినేని పేరు తీసేసిన సమంత
Sumanth Malli Modalaindi | సుమంత్ ‘మళ్లీ మొదలైంది’ ఫస్ట్ లుక్
Review : తిమ్మరుసు సినిమా ఎలా ఉందంటే..
రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సుమంత్.. దేవుడు, దెయ్యాలకు థ్యాంక్స్ చెప్పిన ఆర్జీవీ
సిల్క్ స్మితను కొట్టే ఆడది లేదు.. శ్రీదేవి కూడా ఆమెనే ఫాలో అయ్యేది.. బాలయ్య సంచలన వ్యాఖ్యలు