తిరుమల : అభిషేక ప్రియుడు, ఆనందరూపుడు వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం ( Silathoranam ) వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 77,568 మంది భక్తులు దర్శించుకోగా35,033 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ.4.19 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. 4.15 లక్షల లడ్డూలను విక్రయించామని , 2.38 లక్షల మందికి అన్న ప్రసాదం అందించామని వివరించారు.