హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ పదేండ్ల పాలనలో ఐటీని విస్తరించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తెలంగాణలోని టైర్-2 సిటీల్లోనూ ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేశామని ఆదివారం ఎక్స్ వేదికగా గుర్తుచేశారు. నల్లగొండ, వరంగల్, కరీంనగర్, సిద్దిపేటలో ఐటీ హబ్‌లకు అంకుర్పారణ చేశామని, ఇప్పుడు ఆదిలాబాద్ కూడా ఆ జాబితాలో చేరడం సంతోషకరమని పేర్కొన్నారు.
చిన్న, మధ్యతరహా ఐటీ కంపెనీల కోసం అవసరమైన సదుపాయాల కల్పన, టాస్క్ సెంటర్ల ఏర్పాటు, యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి కల్పన ఈ ఐటీ హబ్‌ల లక్ష్యమని వివరించారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు సైతం ఈ సంకల్పాన్ని కొనసాగిస్తుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఇందుకు
బీఆర్ఎస్ సహకరిస్తుందని స్పష్టంచేశారు.