Gaza | న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న పోరు రోజురోజుకు మరింత ఉద్రిక్తంగా మారుతున్నది. గాజాలోని జబాలియా ప్రాం తంలో ఉన్న చరిత్రాత్మక శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ బలగాలు వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో 29 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని ఇజ్రాయెల్ వైద్యులు శనివారం తెలిపారు.
వేలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్టు అంతర్జాతీయ సహాయ సంస్థలు చెప్తున్నాయి. ఇటీవలి కాలంలో జబాలియా, దాని సమీప ప్రాంతాల్లో పనిచేస్తున్న తమ దళాలు డజన్ల కొద్దీ ఉగ్రవాదులను హతమార్చాయని, ఆయుధాలను గుర్తించడంతోపాటు సైనిక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసినట్టు ఇజ్రాయెల్ దళాలు తెలిపాయి.