కటక్: ఒడిషా మాస్టర్స్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత యువ షట్లర్లు ఉన్నతి హుడా, ఇషారాణి బరూహ్ మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో అమీతుమీ తేల్చుకోనున్నారు. శనివారం జరిగిన ఉమెన్స్ సెమీస్‌లో టాప్ సీడ్ ఉన్నతి.. 18-21, 21-16, 21-16తో తన్సిమ్ మిర్ (భారత్)ను ఓడించి ఫైనల్స్ చేరింది.
మరో సెమీస్‌లో ఇషారాణి.. 18-21, 21-7, 21-7తో సహచర షట్లర్ తన్వి హేమంత్‌ను చిత్తుచేసింది. పురుషుల సింగిల్స్‌లో కిరణ్ జార్జి.. 21-19, 8-21, 21-18తో రోనక్ చౌహాన్‌పై గెలిచి ఫైనల్స్ చేరాడు.