రిమ్స్ టెండర్లలో గోల్మాల్!
ఆదిలాబాద్ రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) టెండర్లలో నిబంధనలకు తిలోదకాలు వదిలినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
- అన్ని టెండర్లు ఒక్కరికే కట్టబెట్టేలా పక్కా స్కెచ్
- కేంద్ర ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు
- ఆరోగ్య శాఖకు సప్లయర్ల అసోసియేషన్ ఫిర్యాదు
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) టెండర్లలో నిబంధనలకు తిలోదకాలు వదిలినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్డియాలజీ, డిస్పోజబుల్స్, డ్రగ్స్, ఎక్విప్మెంట్ టెండర్ ఒక్కరికే దక్కేలా స్కెచ్ వేసినట్టు తెలిసింది. బ్రాండ్ పేరు, కంపెనీ పేరు ప్రస్తావించకూడదని ప్రభుత్వ నిబంధనలు చెప్తున్నాయి. కాగా ఆ రూల్‌ను బ్రేక్ చేసినట్టు సమాచారం. డ్రగ్స్‌లో ఆయా మందులకు సంబంధించి ఎంజీ, ఎంఎల్‌ల పర్సంటేజీ ఎంత అనేది పేర్కొనలేదు.
ప్రతిపాదిత టెండర్లో అన్ని ఐటమ్స్‌కు తప్పనిసరిగా కోట్ చేయాలని ప్రత్యేకంగా క్లాజ్ తీసుకురావడం సైతం వివాదాస్పదంగా మారింది. నిజానికి కార్డియాలజీ సరఫరాదారులు డ్రగ్స్ (మందులు) సరఫరా చేయరు. డ్రగ్స్ సరఫరా చేసే వారు పరికరాలు సైప్లె చేయరు. కానీ ఈ టెండర్లో అన్ని రకాల స్పెసిఫికేషన్లకు కోట్ చేయాల్సిందే అనే నిబంధన తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది. కేవలం తాము అనుకున్న ఒక్కరికే లబ్ధి చేకూర్చాలనే దురుద్దేశంతోనే టెండర్లో అడ్డగోలుగా నిబంధనలు మార్చారని ఆరోపణలున్నాయి.
- ఫిర్యాదు చేసినా స్పందన కరువు
కేంద్ర నిబంధనల ప్రకారం సైప్లెలో ఆలస్యం అయితే 0.5 శాతం పెనాల్టీ వేయాల్సి ఉండగా.. తాజా టెండర్లో వారానికి ఒక శాతం నుంచి 10 శాతం వరకు పెనాల్టీ వేస్తామని పేర్కొనడం గమనార్హం. కేవలం తాము కోరుకున్న వెండర్‌కు టెండర్ దక్కేలా అధికారులు చూస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పరికరాలకు సంబంధించి టెండర్లో సెమీ ఆటోక్లేవ్, బైపోలార్ కాటరీ, కాటరీ ఫోర్సెప్స్, వెంటిలేటర్లు అని పేర్కొన్న అధికారులు అందులో స్పెసిఫికేషన్లు మెన్షన్ చేయకపోవడం అనుమానాలకు తావిస్తున్నది.
ఇక ఈ మొత్తం వ్యవహారంపై ట్విన్ సిటీస్ హాస్పిటల్ సప్లయర్ల అసోసియేషన్ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి, హెల్త్ సెక్రటరీ, డీఎంఈకి ఫిర్యాదు చేసింది. అధికారులు తాము కోరుకున్న వెండర్‌కే టెండర్ దక్కేలా నిబంధనలు మార్చారని ఆరోపించింది. టెండర్లలో నిబంధనల ఉల్లంఘనపై ఆదిలాబాద్ కలెక్టర్, రిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్‌కు ఫిర్యాదులు చేసినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తంచేసింది. ఇప్పటికైనా అధికారులు టెండర్లలో జరిగిన నిబంధనల ఉల్లంఘనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

