హెచ్‌సీఏ ఎస్‌జీఎంకు అనుమతించండి
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అపెక్స్ కౌన్సిల్ పదవీ కాలం ముగియడంతో కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకునేందుకు తక్షణమే చర్యలు ప్రారంభించాలని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శివ్లాల్ యాదవ్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ కోరారు.
- జస్టిస్ నవీన్ రావుకు సభ్యుల వినతి
హైదరాబాద్, ఆట ప్రతినిధి : హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అపెక్స్ కౌన్సిల్ పదవీ కాలం ముగియడంతో కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకునేందుకు తక్షణమే చర్యలు ప్రారంభించాలని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్. శివ్లాల్ యాదవ్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ కోరారు. హెచ్‌సీఏ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న రిటైర్డ్ జస్టిస్ నవీన్ రావు నేతృత్వంలోని సింగిల్ మెంబర్ కమిటీ వెంటనే ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్జీఎం) నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ విషయమై 108 మంది సభ్యులు ఇప్పటికే ఆయనకు లెటర్ రాసి సానుకూల స్పందన కోసం ఎదురుచూస్తున్నామని హైదరాబాద్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. క్రికెట్ శ్రేయస్సు దృష్ట్యా త్వరలోనే ఎస్‌జీఎమ్, ఏజీఎమ్, ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం ఉందని మాజీ కార్యదర్శి కె. జాన్ మనోజ్, వంకా ప్రతాప్, పలువురు క్లబ్ కార్యదర్శులు పేర్కొన్నారు. ముందుగా ఎస్జీఎం నిర్వహిస్తే జస్టిస్ లోధా కమిటీ ఇచ్చిన కీలక సిఫారసులను హెచ్‌సీఏ రాజ్యాంగంలో పొందుపరచాల్సి ఉందని తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

