నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ధోకా!
మాయమాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను ధోకా చేసిందని బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. పట్టభద్రులు అందరూ ఓటు నమోదు చేసుకునేలా బీఆర్ఎస్ కార్యకర్తలు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
- మాజీ మంత్రి ఎర్రబెల్లి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ధ్వజం
- పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి:మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి
- ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంతో కీలకం : మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
మూసాపేట/కల్వకుర్తి/చారకొండ/ఖమ్మం కమాన్‌బజార్/జడ్చర్ల టౌన్/జనగామ,/మహబూబాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : మాయమాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతను ధోకా చేసిందని బీఆర్ఎస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. పట్టభద్రులు అందరూ ఓటు నమోదు చేసుకునేలా బీఆర్ఎస్ కార్యకర్తలు దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.
బుధవారం బీఆర్ఎస్ జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన రఘునాథపల్లి, లింగాలఘన్పూర్ మండలాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదుపై సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎన్నికల ఇన్చార్జి నాగుర్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రానున్న ఎన్నికలో ప్రతి గ్రాడ్యుయేట్ తమ ఓటు ఆయుధంతో కాంగ్రెస్‌కు తగిన సమాధానం చెప్పాలని కోరారు.
పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత పదేండ్లలోఎప్పుడూ లేని దౌర్భాగ్యస్థితి కాంగ్రెస్ హయాంలో దాపురించిందని విమర్శించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పోల్చుతూ తెలంగాణలో కరువు పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయనే అంశాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జనగామ జిల్లా దేవరుప్పుల, పాలకుర్తి మండలాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశాల్లో పాల్గొని దిశానిర్దేశం చేశారు.
పట్టభద్రులు అందరూ ఓటు నమోదు చేసుకొనేలా బీఆర్ఎస్ శ్రేణులు చూడాలని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ఆన్లైన్ కేంద్రాన్ని లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఆన్లైన్లో ఓటరు నమోదు చేసుకున్న పట్టభద్రులకు దరఖాస్తు ఫారాలను లక్ష్మారెడ్డి అందజేశారు. త్వరలో జరగబోయే ఖమ్మం వరంగల్ నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంతో కీలకమని, అందుకోసం అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా న మోదు చేసుకోవాలని పువ్వాడ అజయ్‌కుమా ర్ సూచించారు. పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరంలోని మమత మెడికల్ కళాశాలలో ఆయన మాట్లాడారు.
మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో నిర్వహించిన సమావేశానికి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండల కేంద్రంలో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పార్టీశ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కల్వకుర్తిలో నిర్వహించిన సదస్సుకు రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోళి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గ ఇన్చార్జి రజనీసాయిచంద్ హాజరై మాట్లాడారు.
నిరు ద్యోగులకు అనేక అలవికాని హామీలు ఇచ్చిన మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్‌కు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ డోర్నకల్ నియోజకవర్గ ఇన్చార్జి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో విశ్రాంత ఉద్యోగులు, న్యాయ వాదులతో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి మాట్లాడారు. ఎన్ని కల్లో అన్ని వర్గాల గ్రాడ్యుయేట్లు బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలుపాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

