న్యూఢిల్లీ, జూలై 23 : ప్రస్తుతం వివాదాలకు కేంద్ర బిందువైన కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. 1997లో విద్యార్థి నాయకుడిగా చేసిన రాజయాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. అప్పట్లో ఒడిశా సచివాలయం బయట దాదాపు 1,500 మంది విద్యార్థులతో కలసి ఆందోళన చేసి లాఠీచార్జ్‌లో ఎముకలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు.
ఏబీవీపీలో చురుకుగా పాల్గొన్న ఆయన 1994 నుంచి 1997 వరకు ఆ సంఘానికి జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అదే ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యా శాఖ మంత్రిగా నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసుపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, విపక్ష నాయకుల నుంచి రాజీనామా డిమాండ్లతో తీవ్ర నిరసనను ఎదుర్కొంటున్నారు.