న్యూఢిల్లీ, జూలై 23: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఢిల్లీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్న క్రమంలో నిరసనకు వేదికగా ఉన్న జంతర్ మంతర్‌కు 1.5 కి.మీ పరిధిలో గురువారం అర్ధరాత్రి వరకు మొబైల్ ఇంటర్నెట్ను ప్రభుత్వం నిలిపివేసింది.
అలాగే హోం మంత్రి అమిత్ షా ఇంటి బయట సెక్షన్ 163ను అమలు చేసిన పోలీసులు ఆ ప్రాంతంలో హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ సలహా మేరకు కన్నాట్ ప్లేస్‌లో సాయంత్రం 6.30 గంటలకే దుకాణాలు, వ్యాపార సంస్థలు, హోటళ్లను మూసివేశారు.