Monsoon Kerala Travel : మాన్సూన్ వచ్చిందంటే చాలు.. పర్యాటకులకు పండగే అని చెప్పాలి. ఈ సీజన్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ప్రజలు ఎక్కువగా టూర్స్ ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ మాన్సూన్ సీజన్లో కేరళ (Kerala) వెళ్లాలనుకునే వారి కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) టూరిజం సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది.
“కల్చరల్ కేరళ” (CULTURAL KERALA) పేరుతో ఐఆర్సీటీసీ (IRCTC) ఈ టూర్ ప్యాకేజీని అందిస్తోండగా.. అక్టోబర్ 02న ఈ ప్యాకేజీని (KERALA Tour Package) బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో మున్నార్ (Munnar), అలెప్పీ (Alleppey), కొచ్చి(Kochi), త్రివేండ్రం (Tiruvananthapuram) తదితర పర్యాటక ప్రాంతాలు సందర్శించవచ్చు. హైదరాబాద్ నుంచి టూర్ ప్రారంభం అవుతుండగా.. ఇది 6 రాత్రులు, 7 రోజులు కొనసాగుతుంది. విమాన మార్గంలో (Flight Route) ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు.
ప్రయాణం సాగుతుంది ఇలా
Day 1: Hyderabad to Kochi
మొదటి రోజు హైదరాబాద్ (Hyderabad) లో టూర్ ప్రారంభం అవుతుంది. ఉదయం 5.00 గంటలకు హైదరాబాద్ ఎయిర్ పోర్టు (RGIA) లో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 6.40 గంటలకు కొచ్చి (kochi) చేరుకుంటారు. హోటల్ చెకిన్ అనంతరం కొచ్చి ఫోర్ట్ (Kochi Fort)కు బయలుదేరాలి. అక్కడ స్థానిక ప్రదేశాలైన, యూదుల సినాగోగ్ (Jewish Synagogue), డచ్ ప్యాలెస్ (Dutch palace), చైనీస్ ఫిషింగ్ నెట్స్(Chinees Fishing Nets) లను సందర్శిస్తారు. సాయంత్రం మెరైన్ డ్రైవ్ (Marine drive) ను సందర్శిస్తారు. అనంతరం రాత్రికి కొచ్చిలో బస (Night Stay at Kochi) చేస్తారు.
Day 2 : Kochi to Munnar
రెండో రోజు ఉదయం అల్పాహారం చేసి మున్నార్(Munnar)కు బయలుదేరుతారు. మార్గ మధ్యంలో చీయపారా జలపాతా(Chiyapaara Water falls)న్ని చూడవచ్చు. తర్వాత టీ మ్యూజియం (Tea Museam) సందర్శన ఉంటుంది. రాత్రి మున్నార్((Night Stay at Munnar) లోనే బస చేస్తారు.
Day 3 : Munnar
మూడో రోజు ఉదయం అల్పాహారం చేసి మట్టుపెట్టి డ్యాం(Mattu Petti Dam)కు వెళ్తారు. తర్వాత కూండ్ల డ్యాం లేక్(Kundla Dam Lake), ఎకో పాయింట్ (Echo point) సందర్శన ఉంటుంది. డిన్నర్ అనంతరం రాత్రి మున్నార్ లోనే బస చేస్తారు.
Day 4 : Munnar to Thekkady నాలుగో రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి.. హోటల్ నుంచి చెక్ అవుట్ ఉంటుంది. తర్వాత తేక్కడికి బయలుదేరుతారు. తేక్కడికి చేరుకున్న అనంతరం స్పైస్ ప్లాంటేషన్ల (Spice plantations) సందర్శన ఉంటుంది. రాత్రి డిన్నర్ చేసి తేక్కడిలోనే బస చేస్తారు.
Day 5 : అయిదో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ ముగించుకున్నాక అలెప్పీ(Allepy), కుమారకోమ్ (Kumaramkom) అందాలను వీక్షించటానికి వెళ్తారు. తర్వాత బ్యాక్ వాటర్స్ రైడ్ (Back waters ride) ఉంటుంది. దాంతో అయిదో రోజు పర్యటన ముగుస్తుంది. రాత్రి అలెప్పీలో బస చేస్తారు.
Day 6 : ఆరో రోజు అలెప్పీ హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత చడియమంగళాని (Chadiyamangalam)కి బయలుదేరుతారు. అక్కడ జటాయు ఎర్త్ సెంటర్ (Jatayu Earth Centre) సందర్శన ఉంటుంది. అనంతరం త్రివేండ్రం (Tiruvananthapuram) చేరుకుని రాత్రి త్రివేండ్రంలోనే బస చేస్తారు.
Day 7 : ఏడో రోజు తెల్లవారుజామున శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని (Padmanabhaswamy Temple) దర్శించుకుంటారు. తర్వాత నేపియర్ మ్యూజియం(Naipier Museam) ను సందర్శిస్తారు. అనంతరం తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది. రాత్రి 9.55 గంటలకు త్రివేండ్రం విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 11.30 గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ఐఆర్సీటీసీ కేరళ టూర్ ప్యాకేజీ ధర
ఇక చార్జీల విషయానికి వస్తే.. ప్యాకేజీలో ఒక్కరు ప్రయాణించాలనుకుంటే రూ. 52800 చెల్లించాల్సి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే ఒక్కొక్కరు రూ.38500, ముగ్గురు వ్యక్తులు కలిసి ప్రయాణిస్తే రూ.35600 చెల్లించాల్సి ఉంటుందని ఐఆర్సీటీసీ తెలిపింది. 5 నుంచి 11 సంవత్సరాల వయసు ఉన్న చిన్నారులకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. ఈ టూర్ ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, హోటల్లో బస, బ్రేక్‌ఫాస్ట్ (మధ్యాహ్నం పూట భోజనం, రాత్రి భోజనం యాత్రికులే చూసుకోవాలి). ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.
పూర్తి వివరాల కోసం.. IRCTC వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి