Iranian Students : ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్లో ఆందోళనలు ఇంకా చల్లారడం లేదు. ఇప్పటికీ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇరాన్లో వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కారు. ప్రభుత్వాధినేత ఖమేనీకి, అతడి పాలనకు వ్యతిరేకంగా శనివారం నినదించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్, మషాద్ పట్టణాల్లో విద్యార్థులు, యువత వీధుల్లోకి చేరి నిరసనలు చేపట్టారు.
సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేయాలని, అతడి పాలన నుంచి తమకు స్వేచ్ఛ కావాలని, అలాగే ఈ విషయంలో అమెరికా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక షరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన విద్యార్థులు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో పోలీసులు, భద్రతా బలగాలపైకి దూసుకెళ్లారు. వారికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈ ఉద్యమానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఇరాన్లో జరుగుతున్న ఆందోళనల్లో వేల మంది మరణించారని అమెరికా సహా అంతర్జాతీయ హక్కుల సంఘాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. కానీ, వీటికి ఆధారాలు చూపాలని ఇరాన్ డిమాండ్ చేసింది. అయితే, ఆందోళనల్లో పాల్గొన్న వేలాదిమందిని ఖమేనీ ప్రభుత్వం చంపిందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇరాన్‌పై అమెరికా దాడులకు సిద్దమవుతోంది.
THREAD: Verified videos of anti-government protests in Iran on 21 February
Protests broke out today at Sharif University of Technology in Tehran, with students chanting slogans against the supreme leader.
Video: @SharifiZarchi
Location: https://t.co/7O3kAnsb5y@GeoConfirmed pic.twitter.com/9SArLwfbOp
— Shayan Sardarizadeh (@Shayan86) February 21, 2026
అవసరమైతే ఖమేనీని కూడా చంపాలని అమెరికా భావిస్తోంది. ఇరాన్‌పై అమెరికా ఎప్పుడైనా మెరుపు దాడులకు దిగొచ్చని నేరుగా అమెరికా అధికారులే వెల్లడించారు. అమెరికా దాడుల్ని ఎదుర్కోవడానికి ఇరాన్ కూడా సిద్దమవుతోంది. తమ దగ్గర ఉన్న ఆయుధాల్ని పరీక్షిస్తోంది. సైన్యాన్ని కూడా సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇరాన్లో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.