IPL 2023 : డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటన్స్(Gujarat Titans) పదహారో సీజన్లోనూ అదరగొడుతోంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో వరుసగా రెండో విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. సాయి సుదర్శన్(62) అర్ధ శతకం బాదాడు. డేవిడ్ మిల్లర్ (31) ధాటిగా ఆడడంతో 2 ఓవర్లు ఉండగానే విజయం సాధించింది. దాంతో, సొంత గడ్డపై ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఈ లీగ్‌లో డేవిడ్ వార్నర్ సేనకు ఇది వరుసగా రెండో పరాజయం.
163 టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్ అన్రిజ్ నార్ట్జ్ దెబ్బకు ఓపెనర్లను కోల్పోయింది. వృద్ధిమాన్ సాహా(14), శుభ్‌మన్ గిల్(14)ను అన్రిజ్ నార్ట్జ్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా(5) కూడా వెనుదిరగాడు. ఔట్ చేశాడు. దాంతో పవర్ ప్లేలో గుజరాత్ 3 వికెట్ల నష్టానికి 49 రన్స్ చేసింది. విజయ్ శంకర్(29), సాయి సుదర్శన్(62) నాలుగో వికెట్‌కు 53రన్స్ చేశారు. విజయ్‌ని మార్ష్ ఎల్బీగా ఔట్ చేసి ఢిల్లీకి బ్రేక్ ఇచ్చాడు. కానీ, డేవిడ్ మిల్లర్(31), సాయి సుదర్శన్ ధాటిగా ఆడడంతో 2 ఓవర్లు ఉండగానే విజయం సాధించింది. ఢిల్లీ బౌలర్లలో అన్రిజ్ నార్ట్జ్ రెండు వికెట్లు తీశాడు. ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్ తలా ఒక వికెట్ తీశారు.
ICYMI – @DavidMillerSA12 takes on Mukesh Kumar 🔥🔥🔥#TATAIPL #DCvGT pic.twitter.com/ilEDdItqz3
— IndianPremierLeague (@IPL) April 4, 2023
టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లు చెలరేగడంతో ఢిల్లీ టాపార్డర్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఓపెనర్ పృథ్వీ షా (7), గత మ్యాచ్‌లో డకౌట్ అయిన మిచెల్ మార్ష్(4)ను ఔట్ చేసిన షమీ ఢిల్లీని ఆదిలోనే దెబ్బకొట్టాడు. అయితే.. అల్జారీ జోసెఫ్ ఒకే ఓవర్లో కెప్టెన్ డేవిడ్ వార్నర్(37), రిలే రస్సో(0)ను ఔట్ చేశాడు. చివర్లో అక్షర్ పటేల్(26), సర్ఫరాజ్ ఖాన్ (30) ధాటిగా ఆడి స్కోర్‌బోర్డు వేగం పెంచారు. అభిషేక్ పొరెల్ (20)రాణించాడు. గుజరాత్ బౌలర్లలో షమీ, రషీద్ ఖాన్ తలా మూడు వికెట్లు తీశారు. అల్జారీ జోసెఫ్‌కు ఒక వికెట్ దక్కింది.