ఢిల్లీ: రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 221 పరుగుల ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తడబడుతోంది. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తుండటంతో బ్యాట్స్‌మెన్ ధాటిగా ఆడలేకపోతున్నారు. భారీ లక్ష్య ఛేదనలో మనీశ్ పాండే(31), జానీ బెయిర్‌స్టో(30), విజయ్ శంకర్(8), కేన్ విలియమ్సన్(20) ఔటవడంతో సన్‌రైజర్స్ కష్టాల్లో పడింది. ప్రత్యర్థి బౌలర్లు వైవిధ్యమైన బంతులతో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయకుండా అడ్డుకుంటున్నారు. ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాలని భావించిన కేన్ యువ పేసన్ కార్తీక్ త్యాగీ వేసిన 13వ ఓవర్లో పెవిలియన్ చేరాడు.13 ఓవర్లకు సన్‌రైజర్స్ 4 వికెట్లకు 109 పరుగులు చేసింది. ప్రస్తుతం కేదార్ జాదవ్(11), మహ్మద్ నబీ(4) క్రీజులో ఉన్నారు.
OUT
— IndianPremierLeague (@IPL) May 2, 2021
A big one! Bairstow looks to clear long-on but he completely mistimes it as Rawat comes in to take a smart catch off @rahultewatia02. Big moment in the context of this match. https://t.co/7vPWWkuPYu #RRvSRH #VIVOIPL pic.twitter.com/KlQ5vKGnls