అహ్మదాబాద్: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య మరికాసేపట్లో రసవత్తర పోరు జరగనుంది. కోల్‌కతాపై టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ జట్టులో స్పిన్నర్ అమిత్ మిశ్రా గాయపడటంతో అతని స్థానంలో లలిత్ యాదవ్ టీమ్‌లోకి వచ్చాడు. మరోవైపు కోల్‌కతా జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలో దిగుతోంది. ఢిల్లీ వరుస విజయాలతో దూసుకెళ్తుండగా కోల్‌కతా తడబడుతోంది.
A bird's eye view of the @DelhiCapitals huddle. https://t.co/iEiKUVOcN8 #DCvKKR #VIVOIPL pic.twitter.com/1LRW1mNMpp
— IndianPremierLeague (@IPL) April 29, 2021