న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో పాల్గొనేందుకు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ సోమవారం చెన్నై చేరుకున్నాడు. డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో హోల్డర్ త్వరలో చేరనున్నాడు. ఐతే జట్టులో చేరేముందుకు బీసీసీఐ ఎస్ఓపీల ప్రకారం హోల్డర్ ఏడు రోజుల పాటు క్వారంటైన్లో ఉంటాడు. క్వారంటైన్ పూర్తైన తర్వాత కొవిడ్ టెస్టుల్లో కరోనా నెగెటివ్ వస్తే జట్టులో చేరేందుకు అనుమతిస్తారు.
వెస్టిండీస్ నుంచి వచ్చిన బిగ్మ్యాన్కు స్వాగతం అంటూ సన్‌రైజర్స్ ట్విటర్లో వ్యాఖ్యానిస్తూ ఫొటో పోస్ట్ చేసింది. టాప్-6 బ్యాట్స్‌మెన్‌ను ఎంపిక చేయడం ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది. ఏప్రిల్ 11న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఐపీఎల్ 2021 సీజన్‌ను ఆరంభించనుంది.
Welcoming the big man from the Windies 😁
— SunRisers Hyderabad (@SunRisers) April 5, 2021
Svagatam, @Jaseholder98! 👋🏻#ReturnOfTheRisers #OrangeOrNothing #OrangeArmy #IPL2021 pic.twitter.com/HHdZ6p3pO6