‘ఆదివాసీ యువకుడు తెల్లం శరత్ మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి’
ఆదివాసీ యువకుడు తెల్లం శరత్ మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ములకలపల్లి మండల కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో...
– బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి
– ఆదివాసీ గిరిజన సంఘం భద్రాద్రి జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య డిమాండ్
ములకలపల్లి, నవంబర్ 20 : ఆదివాసీ యువకుడు తెల్లం శరత్ మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ములకలపల్లి మండల కేంద్రంలోని సీపీఎం పార్టీ కార్యాలయంలో గౌరి నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రాచలం పట్టణంలోని లాడ్జీ యాజమాన్యం చేతిలో ఆదివాసీ యువకుడు తెల్లం శరత్ హత్యకు గురయ్యాడనే ఆరోపణల నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ ఘటన యావత్ ఆదివాసీ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురిచేసిందన్నారు. ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను కోరారు. భద్రాచలం పూర్తిస్థాయి ఏజెన్సీ ప్రాంతమైనప్పటికీ అక్కడే ఆదివాసీలకు భద్రత లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. శరత్ మృతి వెనుక ఉన్న వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, నిందితులు ఎవరైనా రాజకీయ లేదా ఇతర ఒత్తిళ్లకు తలొగ్గకుండా పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు.
ఈ ఘటనలో వాస్తవాలను దాచిపెట్టేందుకు లేదా బాధ్యులను రక్షించేందుకు ప్రయత్నిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టపరిధిలో నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగి, వాస్తవ దోషులకు చట్టప్రకారం శిక్ష పడే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆదివాసీల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సున్నం గంగా, సోయం జోగారావు, మడివి రమేష్, సోడెం ప్రసాద్, కుంజ శ్రీను, కుంజా రామ్మూర్తి, పోడియం వెంకటేశ్వర్లు, రాఘవయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

