హైదరాబాద్, ఆట ప్రతినిధి: తాష్కెంట్ (ఉజ్బెకిస్థాన్) వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ టోర్నీలో రాష్ర్టానికి చెందిన యువ జిమ్నాస్ట్ నిశ్క అగర్వాల్ పసిడి పతకంతో మెరిసింది. శనివారం జరిగిన బాలికల జూనియర్ టేబుల్ వాల్ట్ విభాగంలో భారత్ తరఫున బరిలోకి దిగిన నిశ్క అద్భుత ప్రదర్శన కనబరుస్తూ అగ్రస్థానంలో నిలిచింది. బాలికల ఫ్లోర్ ఎక్సర్సైజ్లో నిశ్క మూడో స్థానంతో కాంస్యం ఖాతాలో వేసుకుంది.