1186.14 కోట్లతో న్యాయశాఖ పద్దు
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి అల్లోల
హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ఏర్పాటు తెలంగాణ రాష్ర్టానికే గర్వకారణమని రాష్ట న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. సోమవారం రూ.1186.14 కోట్ల అంచనా ప్రతిపాదనలతో రూపొందించిన న్యాయశాఖ పద్దును అసెంబ్లీలో ఆయన ప్రవేశపెట్టారు. ఆ పద్దుపై శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోక్సో కోర్టుల ఏర్పాటుతో బాధితులకు సత్వర న్యాయం అందుతున్నట్టు చెప్పారు. తెలంగాణలో 36 స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. నల్సార్ విశ్వవిద్యాలయంలో స్థానికులకు రిజర్వేషన్లను 20 శాతం నుంచి 25 శాతానికి పెంచినట్టు వెల్లడించారు. కేసులను త్వరితగతిన పరిషరించేందుకు న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, కక్షిదారులకు సౌలభ్యంగా ఉండేలా హైకోర్టులో ఈ- ఫైలింగ్, వర్చువల్ కోర్ట్స్, కేస్ ఇన్ఫర్మేషన్ పోర్టల్‌ను ఏర్పాటుచేసినట్టు తెలిపారు.