రామగిరి, జూన్ 28 : పదో తరగతి పూర్తైతే చాలు పట్ణణాలు, నగరాలకు గ్రామాల్లోని విద్యార్థులు పయనం కావాల్సిందే. అపుడే ఇంటర్, ఇతర ఉన్నత విద్య అందేది. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. స్థానికంగానే ఇంటర్మీడియేట్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. నల్లగొండ జిల్లాలో తిప్పర్తి, కనగల్ మండలాల్లో నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు తల్లిదండ్రులు అడ్మిషన్లు తీసుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కళాశాలలో చేరిన విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు ఉపకార వేతనం సహితం అందనుంది.
కనగల్ మండల ఎక్స్‌రోడ్డు వద్ద ఉన్న పోలీస్ క్వార్టర్స్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాలను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఇన్చార్జీ ప్రిన్సిపాల్‌గా నల్లగొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సుధారాణికి బాధ్యతలు అప్పగించారు. ఈ కళాశాలలో ఎంపీసీ తెలుగు మీడియంలో 1, ఇంగ్లీష్ మీడియంలో 19, బీపీసీ తెలుగు మీడియంలో 1, ఇంగ్లీష్ మీడియంలో 17, సీఈసీ తెలుగు మీడియంలో 2, ఇంగ్లీష్ మీడియంలో 15, హెచ్ఈసీ తెలుగు మీడియంలో 4, ఇంగ్లీష్ మీడియంలో 6 చొప్పున చేరారు. ప్రస్తుతం 65 మంది విద్యార్థులు ఆయా కోర్సులో అడ్మిషన్స్ తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ సుధారాణి తెలిపారు.
మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఇన్చార్జీ ప్రిన్సిపాల్‌గా నాగార్జున సాగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాజశేఖర్‌కు బాద్యతలు అప్పగించారు. అయితే ఇక్కడ ఎంపీసీలో 11 మంది, బీపీసీ 17, సీఈసీ 06, హెచ్ఈసీ 11 కలిపి ఆయా కోర్సుల్లో మొత్తం 45 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నట్లు తెలిపారు.
Nalgonda : కనగల్, తిప్పర్తిలో ఇంటర్మీడియెట్ కాలేజీలు ప్రారంభం
Nalgonda : కనగల్, తిప్పర్తిలో ఇంటర్మీడియెట్ కాలేజీలు ప్రారంభం