హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఇంటర్‌బోర్డు పొడిగించింది. ఈ నెల 23 వరకు ఫీజు చెల్లించే అవకాశమిచ్చింది. ఫస్టియర్, సెకండియర్ ఫీజు చెల్లింపు గడువు సోమవారంతో ముగియగా, విద్యార్థుల వినతి మేరకు పొడిగించింది.
పరీక్షలు మే 13 నుంచి 21 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 1.5 లక్షల మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు.