High Court | నోటీసు అందకుండానే ఫిర్యాదు మూసేస్తారా.. సమాచార హకు కమిషనర్‌ను ప్రశ్నించిన హైకోర్టు
సమాచారహకు కమిషన్ పంపిన నోటీసు అందకముందే ఫిర్యాదుదారు హాజరుకాలేదని చెప్పి విచారణను మూసివేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని తెలిపింది. మళ్లీ నోటీసు జారీచేసి ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని పేర్కొంది.
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : సమాచారహకు కమిషన్ పంపిన నోటీసు అందకముందే ఫిర్యాదుదారు హాజరుకాలేదని చెప్పి విచారణను మూసివేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఇది సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని తెలిపింది. మళ్లీ నోటీసు జారీచేసి ఫిర్యాదుపై విచారణ చేపట్టాలని పేర్కొంది. కారుణ్య నియామకానికి సంబంధించిన ప్రతిపాదనపై కింది అధికారులు స్పందించకపోవడంతో పెద్దపల్లికి జిల్లాకు చెందిన బీ శంకరయ్య రాష్ట్ర సమాచార కమిషన్‌లో అప్పీలు చేశారు. ఈ అప్పీలుపై ఆగస్టు 29న విచారణకు హాజరుకావాలంటూ ఇచ్చిన నోటీసు అతనికి సెప్టెంబరు 3న అందింది. అయితే నిర్దేశిత తేదీన అతడు హాజరు కాలేదని చెప్పి ఫిర్యాదుపై విచారణను మూసివేసింది.
ఈ చర్యను సవాలు చేస్తూ శంకరయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ, నోటీసు అందకపోవడంతో విచారణకు హాజరుకాలేకపోయారని, పిటిషనర్ వాదనను వినకుండా ఫిర్యాదును మూసేయడం చట్ట వ్యతిరేకమని తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, సమాచార హకు కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేసింది. తాజాగా నోటీసులు జారీచేసి ఇరుపక్షాల వాదనలను విని మూడు వారాల్లో పిటిషనర్ ఫిర్యాదును పరిషరించాలని సమాచారహకు కమిషన్‌ను ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అర్హులైన చెంచులందరికీ ఉపాధి కల్పిస్తాం: సీతక్క
7 నుంచి హకీంపేటలో మెగా రైతుమేళా: తుమ్మల
Gold Adulteration | బంగారం కొంటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. యాసిడ్ పరీక్షలోనూ దొరకని కొత్త కల్తీ!
పర్సంటేజీల వేట.. పాలమూరుపె ఊగిసలాట
Russia Ukraine War | సమిధలుగా తెలంగాణ బిడ్డలు..బతుకుదెరువు కోసం వెళ్లి యుద్ధరంగంలోకి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

