బంగారంలో కొత్త తరహా కల్తీ దందా!
బంగారం కొనుగోలుదారులు, నగల వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తున్న కొత్త తరహా కల్తీ దందా వెలుగులోకి వచ్చింది. బంగారంలో రుథేనియం, ఇరిడియం, ఓస్మియం వంటి భార లోహాల సన్నని పొడిని కలిపి దాని బరువును కృత్రిమంగా పెంచుతున్నారు.
- యాసిడ్ పరీక్షలోనూ దొరకట్లే
- భార లోహాల పొడి కలిపి కృత్రిమంగా బరువు పెంపు
- కరిగించినప్పుడే బయట పడుతున్న అసలు విషయం
న్యూఢిల్లీ: బంగారం కొనుగోలుదారులు, నగల వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తున్న కొత్త తరహా కల్తీ దందా వెలుగులోకి వచ్చింది. బంగారంలో రుథేనియం, ఇరిడియం, ఓస్మియం వంటి భార లోహాల సన్నని పొడిని కలిపి దాని బరువును కృత్రిమంగా పెంచుతున్నారు. ఈ కల్తీ బంగారం అసలైన బంగారంలా ఉండటమే కాకుండా సాధారణంగా చేసే యాసిడ్ పరీక్ష, టచ్స్టోన్(గీటురాయి) పరీక్షల్లోనూ దొరుకడం లేదు. నగలను తయారు చేసేందుకు బంగారాన్ని కరిగించినప్పుడు మాత్రమే అసలు మోసం బయటపడుతున్నది. ఈ కొత్త తరహా కల్తీని మార్కెట్లో ‘గోల్డ్ పౌడర్’గా పిలుస్తున్నట్టు వ్యాపార వర్గాలు చెప్తున్నాయి.
మధ్యప్రదేశ్లోని ఇండోర్ సరాఫా మార్కెట్లో పనిచేస్తున్న పలువురు నగల తయారీ కళాకారులు బంగారం నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇండోర్ సిల్వర్, గోల్డ్ అండ్ జ్యువెలరీ ట్రేడర్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం నిర్వహించింది. బులియన్ వ్యాపారులు, మధ్యవర్తులు బంగారం కొనుగోలు చేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 99.50 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం వ్యాపారానికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్టు స్థానిక వ్యాపారవర్గాలు తెలిపాయి.
మూడేండ్లుగా భారీ లోహాల కల్తీ ఫిర్యాదులు
రుథేనియం, ఇరిడియం, ఓస్మియం వంటి లోహాలను బంగారంలో కలుపుతున్నారన్న ఫిర్యాదులు గత రెండు మూడేండ్లుగా వస్తున్నాయని వ్యాపారులు చెప్తున్నారు. వీటి సాంద్రత ఎక్కువగా ఉండటంతో తక్కువ పరిమాణంలో కలిపినా బంగారం మొత్తం బరువు పెరుగుతుంది. మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ మార్గాల ద్వారా ఈ కల్తీ పదార్థాలు భారత మార్కెట్లకు చేరుతున్నట్టు అనుమానిస్తున్నారు. వీటిని చైనాలో తయారు చేస్తున్నారన్న సందేహాలు కూడా ఉన్నప్పటికీ, వాటి మూలాలపై స్వతంత్రంగా నిర్ధారణ కాలేదు. సాధారణ యాసిడ్, గీటురాయి పరీక్షలతో పాటు పాతతరహా క్యారెట్ పరీక్షా యంత్రాలు కూడా ఈ కల్తీని గుర్తించడంలో విఫలమవుతున్నట్టు వ్యాపారులు చెప్తున్నారు. ఎక్స్రే ఫ్లోరోసెన్స్ (ఎక్స్ఆర్ఎఫ్) పరీక్షలు, ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ వంటి ఆధునిక సాంకేతిక పద్ధతులతో బంగారంలోని ఇతర లోహాల ఉనికిని గుర్తించే అవకాశం ఉన్నది. అందువల్ల బంగారం కొనుగోలు, విక్రయాల్లో నాణ్యతా పరీక్షలను మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఏర్పడింది.
వినియోగదారులు ఏం చేయాలి?
- బీఐఎస్ హాల్మార్క్ , ఆరు అంకెల గుర్తింపు సంఖ్య ఉన్న నగలనే కొనుగోలు చేయాలి.
- బీఐఎస్ కేర్ యాప్లో నంబరును నమోదు చేసి నగ వివరాలు, ప్రకటించిన స్వచ్ఛతను పరిశీలించాలి.
- నమ్మకమైన నగల దుకాణాల్లోనే కొనుగోలు చేయాలి.
- కొనుగోలు బిల్లును తప్పనిసరిగా తీసుకోవాలి.
- అనుమానం ఉంటే పరీక్షా కేంద్రంలో నాణ్యతను పరీక్షించాలి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

