హైదరాబాద్-కరీంనగర్ మధ్య ఈ-సిగరెట్ల అక్రమ దందా!
నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్‌ల అక్రమ వ్యాపారం సాగిస్తున్న అంతర్రాష్ట్ర సరఫరా నెట్ వర్ను ఈగల్ ఫోర్స్ గుట్టురట్టు చేసింది. కోల్‌కతా నుంచి కొరియర్ ద్వారా హైదరాబాద్‌కు, అకడి నుంచి కరీంనగర్‌కు ఈ-సిగరెట్లను సరఫరా చేస్తున్న వ్యవస్థను గుర్తించింది. రెండు వేర్వేరు ఆపరేషన్లలో ఇద్దరిని అదుపులోకి తీసుకొని మొత్తం 31 ఈ-సిగరెట్లు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుంది. నిషేధిత ఉత్పత్తులను చిన్నారులకు సైతం విక్రయిస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది.
- కోల్‌కతా నుంచి కొరియర్.. హైదరాబాద్
- నుంచి రవాణా.. కరీంనగర్లో విక్రయాలు
- ఈగల్ ఫోర్స్ దాడులతో వెలుగులోకి అంతర్రాష్ట్ర సరఫరా నెట్వర్
హైదరాబాద్, నవంబరు 15 (నమస్తే తెలంగాణ): నిషేధిత ఈ-సిగరెట్లు, వేప్‌ల అక్రమ వ్యాపారం సాగిస్తున్న అంతర్రాష్ట్ర సరఫరా నెట్ వర్ను ఈగల్ ఫోర్స్ గుట్టురట్టు చేసింది. కోల్‌కతా నుంచి కొరియర్ ద్వారా హైదరాబాద్‌కు, అకడి నుంచి కరీంనగర్‌కు ఈ-సిగరెట్లను సరఫరా చేస్తున్న వ్యవస్థను గుర్తించింది. రెండు వేర్వేరు ఆపరేషన్లలో ఇద్దరిని అదుపులోకి తీసుకొని మొత్తం 31 ఈ-సిగరెట్లు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుంది. నిషేధిత ఉత్పత్తులను చిన్నారులకు సైతం విక్రయిస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది.
ఈ నెల 12న ఈగల్ ఫోర్స్ ఆర్ఎన్సీసీ కరీంనగర్ బృందం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిస్మిల్లా హోటల్ అండ్ కేఫ్‌పై దాడి చేసింది. మైనర్‌కు నిషేధిత ఈ-సిగరెట్లు విక్రయిస్తున్నట్టు గుర్తించిన మహ్మద్ ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకుంది. అతడి వద్ద నుంచి 12 ఈ-సిగరెట్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకుంది. ప్రాథమిక విచారణలో ఆయాన్ అనే వ్యక్తి ద్వారా, ఆ తర్వాత హైదరాబాద్‌కు చెందిన రాహిల్ఖాన్ అలియాస్ ఒమర్ నుంచి కొరియర్ సర్వీసుల ద్వారా ఈ-సిగరెట్లు తెప్పించుకున్నట్టు ఆసిఫ్ వెల్లడించాడు.
ఈగల్ ఫోర్స్ ఈ నెల 14న హైదరాబాద్‌లోని మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాడి చేసి రాహిల్ఖాన్ను అదుపులోకి తీసుకొని వివిధ బ్రాండ్లకు చెందిన 19 ఈ-సిగరెట్లు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏడు నెలల క్రితం దుస్తుల కొనుగోలు కోసం కోల్‌కతా వెళ్లిన రాహిల్‌కు అకడి ఆదిల్ ఎంటర్ప్రైజెస్ దుకాణం యజమానితో పరిచయం కాగా జెడ్ఎస్ లాజిస్టిక్స్ కొరియర్ సొల్యూషన్స్ ద్వారా పలుమార్లు వేప్‌లను హైదరాబాద్‌కు పంపించినట్టు గుర్తించారు. చివరిసారిగా ఈ ఏడాది అక్టోబరు 22న పార్సిల్ అందినట్టు విచారణలో వెల్లడి కాగా సరఫరా వ్యవస్థను గుర్తించకుండా ఉండేందుకు రాహిల్ వేర్వేరు పేర్లు, పలు మొబైల్ నంబర్లతో ఆర్డర్లు ఇచ్చేవాడని ఈగల్ ఫోర్స్ గుర్తించింది. అతను ఇప్పటివరకు ఏడుసార్లు సరుకు తెప్పించుకున్నట్లు సమాచారం. ఈ సరఫరా నెట్వర్లో ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించి అరెస్టు చేసేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

