స్థిరాస్తి కుదేలు!
నగర రియల్ ఎస్టేట్ రంగానికి ఎన్నడూ లేని విధంగా వరుస షాక్‌లు తగులుతున్నాయి. గోరు చుట్టూ రోకలి పోటు చందంలా ప్రభుత్వ నిర్ణయాలు, కఠినతరమైన నిబంధనలు ప్రధానంగా మహానగర రియాల్టీ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి.
- నూతన నిభధన రియల్ ఎస్టేట్ చిన్న భిన్నం
- రాచపుండులా హైడ్రా.. మూసీ కూల్చివేతలు, 22ఏ
- అంతలోనే వీఎల్టీ, పీటీఐఎన్ ఆంక్షల పిడుగు
సిటీబ్యూరో, నవంబర్ 15(నమస్తే తెలంగాణ): నగర రియల్ ఎస్టేట్ రంగానికి ఎన్నడూ లేని విధంగా వరుస షాక్‌లు తగులుతున్నాయి. గోరు చుట్టూ రోకలి పోటు చందంలా ప్రభుత్వ నిర్ణయాలు, కఠినతరమైన నిబంధనలు ప్రధానంగా మహానగర రియాల్టీ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. సొంతింటి కలలతో రిస్ చేసి ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులు, మధ్యతరగతితో పాటు, వేల కోట్లు రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రాజెక్టులు నిర్మించే డెవలపర్లు, ఔత్సాహిక రియల్టర్లు గందరగోళంలో పడిపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అమలవుతున్న విధానాలు రియల్ ఎస్టేట్ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ పేరుతో ప్రభుత్వం హైడ్రా బుల్డోజర్లతో చేసిన విధ్వంసం ఇప్పటికీ రాచపుండుగానే ఉంది. ఎకడ ఎవరి ఇల్లు కూలుస్తారో, ఏ వెంచర్‌ను బుల్డోజర్లు చదును చేస్తుందనే భయాందోళనల నుంచి కోలుకోక ముందే మూసీ ప్రక్షాళన పేరిట జరిగిన కూల్చివేతలతో కనీసం తలదాచుకునే చోటు లేకుండా చేసింది. ప్రక్షాళన ముసుగులో చెరువులు, కుంటలు, నదీ పరీవాహక పరిధిలో నిర్మాణాల కూల్చివేతలను చూసి నగరవాసులు భయాందోళనకు గురిచేశాయి. నదీ పరీవాహక ప్రాంతాల్లోని వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యే పరిస్థితి రావడంతో ఇన్వెస్టర్లు హైదరాబాద్ పెట్టుబడులంటే భయపడిపోయే పరిస్థితికి సిటీ రియాల్టీ మారింది. అంతలోనే సామాన్యుడి ఆస్తులే లక్ష్యంగా తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్తో చేసిన విధ్వంసంతో పేదోడీ ఆస్తులను నిర్వీర్యం చేసిన సరార్.. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం విధించిన నిబంధనలు, ఫీజుల మోత సామాన్యులపై ఆర్థిక భారాన్ని మోపాయి. ఏండ్ల తరబడి ప్లాట్లు కొని రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదొక పెద్ద పరీక్షగా మారింది. ఇలాంటి సమయంలోనే వారసత్వంగా వచ్చిన ఆస్తులు, యాజమాన్య హకుల బదిలీలోనూ రిజిస్ట్రేషన్ యాక్ట్ సెక్షన్ 22-ఏ కింద విధిస్తున్న ఆంక్షలు ఆస్తుల అమ్మకాలను అడ్డుకుంటున్నాయి.
అమ్ముకునే వీల్లేకుండా చేసి..
ఇప్పటికే వివిధ రకాల ఆంక్షలతో కుదేలైన రియల్ ఎస్టేట్ రంగానికి తాజాగా ప్రభుత్వం తీసుకువచ్చిన వీఎల్టీ (వేకెట్ ల్యాండ్ ట్యాక్స్), (ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటీఫికేషన్ నంబర్)పీటీఐఎన్ నిబంధనలు కోలుకోలేని పెద్ద దెబ్బగా మారాయి. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ జారీ చేసిన తాజా మెమో ప్రకారం.. ఇకపై ఏరకమైన ఆస్తి రిజిస్ట్రేషన్ జరగాలన్నా నిర్మాణాలకు పీటీఐఎన్, ఖాళీ జాగాలకు వీఎల్టీ నంబర్ తప్పనిసరి చేసింది. దీంతో ఎప్పుడో కొనుగోలు చేసిన ప్లాట్లు, వారసత్వంగా వచ్చిన ఖాళీ జాగాలను అమ్ముకునే వీల్లేకుండా చేసి భూ యజమానులను గందరగోళానికి గురిచేస్తోంది.
చిచ్చు పెడుతున్న కొత్త నిబంధనలు
ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకోవాలంటేనే పీటీఐఎన్ నంబర్‌ను, వీఎల్టీ నంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేయాల్సి వస్తోంది. ట్యాక్స్ నంబర్ లేనివారు నేరుగా స్లాట్ బుక్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. అయితే నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ల విషయంలోనే అసలు గందరగోళం మొదలైందని, నిబంధనల ప్రకారం సాధారణంగా అపార్ట్మెంట్లు, భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్(ఓసీ) వచ్చిన తర్వాత, నిర్మాణం పూర్తయ్యాక మాత్రమే ప్రాపర్టీ ట్యాక్స్ మదింపు జరుగుతుంది. కానీ నిర్మాణ దశలో ఉన్న ఫ్లాట్లను విక్రయించి రిజిస్ట్రేషన్ చేయాలనుకునే వారికి పీటీఐఎన్ నంబర్ ఎకడి నుంచి వస్తుందనే దానిపై స్పష్టత లేకపోవడంతో బిల్డర్లు, కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.
ట్యాక్స్ నంబర్ లేని పక్షంలో 48 గంటల తర్వాత స్లాట్ బుక్ చేసుకోవడం, పెండింగ్ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. మున్సిపల్ సిబ్బంది నుంచి సకాలంలో స్పందన రాకపోతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ రోజుల తరబడి నిలిచిపోయే ప్రమాదముంది. పన్ను చెల్లించే వరకు అసలు డాక్యుమెంట్ చేతికి రాకపోవడం కొనుగోలుదారులను మానసిక ఆందోళనకు గురిచేస్తోంది. నగర శివారు ప్రాంతాల్లో లక్షలాదిగా ఉన్న వెంచర్లలోని ఖాళీ ప్లాట్లను అమ్ముకోవాలన్నా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా ఈ పన్నుల నిబంధనలు కొనుగోలుదారులను బెంబేలెత్తిస్తున్నాయి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

