అశుద్ధ జలాలు..!
గ్రేటర్ వ్యాప్తంగా ఉత్పన్నమవుతున్న వ్యర్థ జలాలను శుద్ధి చేసి పునర్వినియోగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించింది. అన్ని ప్రభుత్వ మురుగు శుద్ధి కేంద్రాల నుంచి విడుదలవుతున్న నీటిని తాగునీటి యేతర అవసరాలకు వాడేలా గ్రీన్ ట్యాంకర్ వ్యవస్థను ప్రారంభించింది.
- ఎస్టీపీ నుంచి వచ్చిన నీటితో స్కిన్ అలర్జీలు, దుర్వాసన
- జెట్టింగ్ మిషన్ నిర్వాహకులకు చర్మవ్యాధులు
- అదే నీరు గ్రీన్ ట్యాంకర్లకు సరఫరా.. నగరవాసుల్లో ఆందోళన
- నామమాత్రంగా శుద్ధి చేసి వదులుతున్న జలమండలి
గ్రేటర్ వ్యాప్తంగా ఉత్పన్నమవుతున్న వ్యర్థ జలాలను శుద్ధి చేసి పునర్వినియోగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించింది. అన్ని ప్రభుత్వ మురుగు శుద్ధి కేంద్రాల నుంచి విడుదలవుతున్న నీటిని తాగునీటి యేతర అవసరాలకు వాడేలా గ్రీన్ ట్యాంకర్ వ్యవస్థను ప్రారంభించింది. దాదాపు వంద గ్రీన్ ట్యాంకర్ల ద్వారా నీటిని ల్యాండ్ స్కేపింగ్, గ్రీనరీ, నిర్మాణ రంగాలకు సరఫరా చేస్తున్నారు. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎస్టీపీల నుంచి నీరు నామమాత్రంగా శుద్ధి చేయడంతో సిటీ జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జలమండలి అధికారులను వివరణ కోరగా జెట్టింగ్ నిర్వాహకులు వాడుతున్న నీళ్లు ఎస్టీపీల నుంచి సేకరించినవి కాదని.. ప్రైవేట్ ఎఫ్ల్యూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నుంచి తీసుకున్నారని చెబుతున్నారు.
నిర్లక్ష్యపు నీడలో ఎస్టీపీలు
నగరంలోని మురుగు నీటి శుద్ధి కేంద్రాల నిర్వహణలో నెలకొన్న నిర్లక్ష్యాన్ని అద్దంపడుతున్నాయి. శుద్ధి ప్రక్రియ సక్రమంగా చేయకపోవడం వల్ల ఆ నీటిలోని రసాయనాల వల్లే జెట్టింగ్ మిషన్లలో పనిచేస్తున్న కార్మికులకు చర్మ సమస్యలు వస్తున్నట్లు తెలుస్తున్నది. ఆ నీరు కూడా నలుపు రంగులో ఉండటం, అందులో చెత్త ఉండటంతో శుద్ధి నామమాత్రంగానే చేసినట్లు అవగతమవుతున్నది. నీటి కొరతను అధిగమించేందుకు వృథాగా పోతున్న శుద్ధ జలాలను వాడాలనే నిర్ణయం మంచిదే అయినా.. ఆ నీటి శుద్ధీకరణపై కూడా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. అధికారులు మరింత శ్రద్ధ తీసుకుని నీటిని సమగ్రంగా శుద్ధి చేసి సరఫరా చేయాల్సి ఉంటుంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

