వికారాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ( Supplementary Examinations) పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ( Prateek Jain ) అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో ఇంటర్ పరీక్షల ( Inter Exams ) నిర్వహణపై ఆయా శాఖల అధికారులతో జిల్లా సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 22 నుంచి 28 వరకు రెండు సెషన్లలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సంవత్సరం పరీక్షలు , ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరుగుతాయని వివరించారు. దానికనుగుణంగా ఆర్టీసీ రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. అంతరాయం లేకుండా విద్యుత్ అందించాలన్నారు.
పోస్టల్ డిపార్ట్మెంట్ పార్సిళ్ల కోసం తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని ఆదేశించారు. పరీక్షలకు అవసరమైన ఇన్విజిలేటర్లను జిల్లా విద్యాధికారి కేటాయిస్తారని పేర్కొన్నారు. పరీక్షలు జరుగుతుందని అన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ , జిల్లా మెడికల్ ఆఫీసర్ వెంకట రమణ, ఆర్టీసీ డిపో మేనేజర్ అరుణ, వివిధ శాఖల అధికారులు , జిల్లా ఇంటర్ నోడల్ అధికారి శంకర్ నాయక్, జిల్లా పరీక్షల సమన్వయ కమిటీ సభ్యులు నర్సింహా రెడ్డి, సత్తయ్య, ప్రిన్సిపాల్ సురేశ్వర స్వామి, ట్రాన్స్కో ఎస్ఈ రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.