e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home News భక్తిశ్రద్ధలతో విగ్రహాల ప్రతిష్ఠాపన

భక్తిశ్రద్ధలతో విగ్రహాల ప్రతిష్ఠాపన

  • పూజలు చేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి

దేవరకద్ర రూరల్‌, నవంబర్‌ 24 : మండలంలోని అడవి అజిలాపూర్‌ గ్రామంలో బుధవారం దేవతా విగ్రహాలు, ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నూతనంగా నిర్మించిన ఆలయంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆంజనేయస్వామి, నవగ్రహాల విగ్రహాలతోపాటు ధ్వ జస్తంభం ప్రతిష్ఠించారు. అలాగే బొడ్రాయి ప్రతిష్ఠా కా ర్యక్రమాన్ని కనులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యేను ఆల య నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అదేవిధంగా చిన్నచింతకుం ట మండలం లాల్‌కోట గ్రామంలో ఈనెల 27నుంచి ప్రారంభం కానున్న గ్రామదేవతల ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కావాలని సర్పంచ్‌ సంధ్యారత్నం గ్రామ పెద్దలతో కలిసి ఎమ్మెల్యే ఆలకు ఆహ్వాన పత్రిక అందజేశారు. అలాగే జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణసుధాకర్‌రెడ్డిని ఆహ్వానించినట్లు తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement