మల్కాజిగిరి, నవంబర్ 19: అంజనేయస్వామి దీవెనలు అందరికీ ఉంటాయని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం మల్కాజిగిరి డివిజన్ ఎల్బీ నగర్ పార్కులో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఎమ్మెల్యే ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్, అసోషియేషన్ సభ్యులు ప్రసాద్, లక్ష్మణ్, గౌలికర్ రవీందర్, రాజు, గోపాల్, సత్తి, శ్రీనివాస్, గణేశ్, నరేందర్, వినయ్, మధుగౌడ్ నాయకులు జగదీశ్‌గౌడ్, జీఎన్వీ సతీశ్‌కుమార్, గుండ నిరంజన్, మండల రాధాకృష్ణయాదవ్, పి. శ్రీనివాస్, రాముయాదవ్, రవీయాదవ్ పాల్గొన్నారు.