నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
స్థానిక విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్డు సమీపంలో నిబంధనలకు తిలోదకాలిస్తూ నూతనంగా వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించబోతున్న ఓ బహుళ అంతస్తుల భవన యజమాని చేపట్టిన పనులు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. చట్టాలను, నిబంధనలను తుంగలో తొక్కి రోడ్డును ఆక్రమించి...
– 30 అడుగుల రోడ్డు 27 అడుగులకు కుదింపు
– అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం
చుంచుపల్లి, అక్టోబర్ 19 : స్థానిక విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్డు సమీపంలో నిబంధనలకు తిలోదకాలిస్తూ నూతనంగా వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించబోతున్న ఓ బహుళ అంతస్తుల భవన యజమాని చేపట్టిన పనులు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. చట్టాలను, నిబంధనలను తుంగలో తొక్కి రోడ్డును ఆక్రమించి మరీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తుండడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. కాలనీ లేఅవుట్ ప్రకారం ప్రజల రాకపోకల కోసం 30 అడుగుల రోడ్డు ఉండాల్సి ఉండగా, భవన యజమాని ఏకంగా 3 అడుగుల మేర రోడ్డు స్థలాన్ని ఆక్రమించారని కాలనీవాసులు మండిపడుతున్నారు. రోడ్డుకు ఆనుకుని అక్రమంగా పిల్లర్లు వేసి ట్రాన్స్ఫార్మర్ బిగించడంతో రోడ్డు వెడల్పు 27 అడుగులకే పరిమితమైందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమంగా 3 అడుగులు ఆక్రమించి ట్రాన్స్ఫార్మర్ ఎలా ఏర్పాటు చేస్తారని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రద్దీగా ఉండే ప్రాంతంలో రోడ్డును కుదించి, హైటెన్షన్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం వల్ల పెను ప్రమాదాలు జరిగే అవకాశముందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానికులు పంచాయతీ సెక్రటరీతో పాటు విద్యుత్ శాఖ ఏఈ లక్ష్మీ నరసింహారావుకు ఫిర్యాదు చేశారు.
నోటీసులు ఇచ్చాం
ఈ వ్యవహారంపై పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా నిబంధనలు అతిక్రమించి రోడ్డుపై రాంప్ నిర్మించడం, అదేవిధంగా రోడ్డును ఆక్రమించి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తున్న సదరు భవన యజమానికి ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. తగిన వివరణ రాకపోతే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఎన్వోసీ ఉంటేనే విద్యుత్ కనెక్షన్
నిబంధనలకు విరుద్ధంగా రోడ్డును ఆక్రమించి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ సరఫరా ఇవ్వబోమని విద్యుత్ శాఖ ఏఈ లక్ష్మి నరసింహారావు తెలిపారు. పంచాయతీ అధికారుల నుండి నిరభ్యంతర పత్రం (NOC) సమర్పిస్తేనే భవన యజమాని ఏర్పాటు చేసుకున్న ట్రాన్స్ఫార్మర్కు కనెక్షన్ ఇస్తామని స్పష్టం చేశాం.
భవన యజమానిపై గతంలోనూ కేసు నమోదు
సదరు భవన యజమానికి నిబంధనలు ఉల్లంఘించడం కొత్తేమీ కాదని స్థానికులు విమర్శిస్తున్నారు. గతంలో ఇదే బహుళ అంతస్తుల భవన నిర్మాణ సమయంలో పెయింటింగ్ పనుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఓ పెయింటర్ భవనం పైనుంచి కిందపడి దుర్మరణం పాలయ్యాడు. ఆ ఘటనలో యజమానిపై నిర్లక్ష్యం కింద కేసు కూడా నమోదైంది. అయినా సదరు యజమాని తీరు మారకపోవడం గమనార్హమని స్థానికులు చర్చించుకుంటున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

