న్యూఢిల్లీ: అమెరికాలో టిక్‌టాక్ ఫేమస్. కానీ ఇప్పుడు ఆ సోషల్ మీడియా యాప్ భవిష్యత్తుపై గ్యారెంటీ లేదు. అయితే ఇన్స్టాగ్రామ్ ఆ పరిస్థితిని వాడుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇన్‌స్టాలో రీల్స్‌కు ఫుల్ క్రేజీ ఉన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా యూజర్స్ కోసం.. ఇప్పుడు ప్రత్యేకంగా రీల్స్ కోసం ఓ యాప్(Reels App)ను రిలీజ్ చేయాలని ఇన్స్టాగ్రామ్ ప్రిపరేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇన్‌స్టా ఫ్లాట్‌ఫామ్ అధినేత ఆడమ్ మొస్సోరి.. దీని గురించి ఓ ప్రకటన చేశారు. టెక్నాలజీ వార్తలను ప్రచురించే ద ఇన్ఫర్మేషన్ పత్రికలో కూడా దీనిపై స్టోరీ వచ్చినట్లు తెలుస్తోంది. ఇన్స్టాగ్రామ్ పేరెంట్ కంపెనీ అయిన మెటా సంస్థ మాత్రం సపరేట్ రీల్స్ యాప్ గురించి ఇంకా ఎటువంటి స్పందన ఇవ్వలేదు.