మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
పెన్పహాడ్ మండలంలోని మేగ్యతండాలో ఇటీవల నూతనంగా నిర్మించిన గ్రామీణ మహిళా శక్తి భవనాన్ని డీఆర్డీఓ పీడీ సన్యాసయ్య బుధవారం పరిశీలించారు. భవన నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే నిర్మాణంలో ఉన్న గ్రామ పంచాయతీ భవన పనులను ఆయన పరిశీలించారు.
పెన్పహాడ్, అక్టోబర్ 14 : పెన్పహాడ్ మండలంలోని మేగ్యతండాలో ఇటీవల నూతనంగా నిర్మించిన గ్రామీణ మహిళా శక్తి భవనాన్ని డీఆర్డీఓ పీడీ సన్యాసయ్య బుధవారం పరిశీలించారు. భవన నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే నిర్మాణంలో ఉన్న గ్రామ పంచాయతీ భవన పనులను ఆయన పరిశీలించారు. మహిళా శక్తి భవన నిర్మాణం కోసం అప్పులు చేసి పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా నేటికీ నయా పైస బిల్లులు రాలేదని సర్పంచ్ భూక్యా రాజు నాయక్ పీడీకి మొర పెట్టుకున్నారు. అనతికాలంలోనే ఈ పథకం కింద రాష్ట్రంలోనే మహిళా శక్తి భవనం పూర్తి చేసినా బిల్లులు రాలేదని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన పీడీ బిల్లులు త్వరగా మంజూరయ్యేలా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
గ్రామాల్లో రోజుకు కనీసం 100 మందికి తగ్గకుండా ఉపాధి పనులు కల్పించాలని అధికారులకు సూచించారు. కాగా సర్పంచ్ భూక్యా రాజు నాయక్ తన తండ్రి భూక్యా గోలియా, తాత జేతియా జ్ఞాపకార్థంగా ఈ భవనాల నిర్మాణం కోసం రూ.7.50 లక్షలతో 4.20 గుంటల స్థలం కొనుగోలు చేసి గ్రామ పంచాయతీకి దానం చేయడంపై సర్పంచ్ ను పీడీ అభిందించారు. రాజునాయక్ దానం చేసిన స్థలంలో మహిళా శక్తి భవనం పూర్తికాగా, పంచాయతీ భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జానయ్య, ఎంపీవో రాజేశ్వర్, ఏపీఓ రవి, ఏపీఎం అంజయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

