Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
Kethireddy Vasudeva reddy | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గాలి మాటలు మాట్లాడుతున్నాడు. విప్‌గా గా ప్రజలకు మంచి పనులు చేయాల్సింది పోయి.. ఎంతసేపు విమర్శించడమే సరిపోతుందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి ఫైర్ అయ్యారు.
Kethireddy Vasudeva reddy | కాంగ్రెస్ ఎమ్మెల్సీ MLC బల్మూరి వెంకట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అసత్య ఆరోపణలు చేశారు..ఆయన బల్మూరి వెంకట్ కాదు ఇచ్ గార్డు వెంకట్ అని కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బల్మూరి వెంకట్ గాలి మాటలు మాట్లాడుతున్నాడు. విప్‌గా గా ప్రజలకు మంచి పనులు చేయాల్సింది పోయి.. ఎంతసేపు విమర్శించడమే సరిపోతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ ఆసుపత్రి మెడికవర్ ఆసుపత్రి. మెడికవర్ ఆసుపత్రిలో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. మెడికవర్ ఆసుపత్రి వద్ద వందల సంఖ్యలో పోలీసులు ఉంటున్నారు. కాంగ్రెస్ నాయకులు పసలేని అర్దంలేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
సినిమా ప్రమోషన్ కోసం ఎక్కడైనా పెట్టుకుంటారు. సిరిసిల్లను కేటీఆర్ ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేశారని కేతిరెడ్డి అన్నారు. కొండా సురేఖ, చిన్నా రెడ్డి, యాడ్ ఏజెన్సీ మహిళను బంధించింది ఎవరు…? కుంభకోణాలకు అడ్డగా గాంధీ భవన్ మారింది.కాంగ్రెస్ కాదు స్కాంగ్రీస్ గా మారిపోయింది. కాంగ్రెస్ అవినీతిపై దేశ ప్రధాని మోడీనే చెప్పిండు. రాష్ట్రంలో R&R ట్యాక్స్ వసూల్ చేస్తున్నారని.. మంత్రులు 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు.
మంత్రుల కమిషన్లపై పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. బల్మూరివెంకట్ దొర అహంకారంతో వ్యవహరిస్తున్నాడు. దళిత NSUI రాష్ట్ర అధ్యక్షుడిని వేధించాడు. మా నాయకుల పై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే బల్మూరి వెంకట్ నాలుక కోస్తామని కేతిరెడ్డి హెచ్చరించారు. గాడిద దొంగతనం చేసిన వ్యక్తి బల్మూరి వెంకట్. వెంకట్ చరిత్ర బయటపెడితే ఉరి వేసుకొని చస్తాడు. పార్టీలో చేర్చుకొమని కేటీఆర్ కాళ్లు మొక్కిన వ్యక్తి వెంకట్. చామల కిరణ్ కుమార్ రెడ్డికి నోటి దురుసు ఎక్కువ. అందుకే చామల కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీ నుంచి పక్కకు పెట్టారు.
కాంగ్రెస్ అక్రమాలు రోజుకొకటి బయటపడుతుంటే తట్టుకోలేక పోతున్నారు. ఈరోజు బల్మూరి వెంకట్. మాట్లాడిన మాటలకు వెంటనే క్షమాపణలు చెప్పాలి. బాడీ షేమింగ్‌కు కేరాఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి. మాజీ IPS అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురించి మాట్లాడే నైతిక హక్కు చామల కిరణ్ కుమార్ రెడ్డికి లేదు. చామల కిరణ్ కుమార్ రెడ్డి చిట్టా మొత్తం బయటకు తీస్తాం. రాహుల్ గాంధీ సంతకాన్నే పోర్జరి చేసిన ఘనత చామల కిరణ్ కుమార్ రెడ్డిదన్నారు.
Read Also :
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

